ముంచుకొస్తున్న ఎన్నికల గడువుని దృష్టిలో పెట్టుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మన్థతిమండలిలో మరింత మందికి చోటు కల్పించేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టుగా అమరావతి నుంచి వార్తలు లీకవుతున్నాయి.రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక వర్గాల సమీకరణాల ప్రకారం కొంతమందికి క్యాబినెట్లో చోటు కల్పించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది.
అదికూడా ఈ నెలాఖరులోపు ఆ తతంగం పూర్తి చెయ్యాలనే ఆలోచనలో బాబు ఉన్నాడట.ఈ వార్త బయటకి తెలియడంతో మంత్రి పదవులు ఆశించే వారంతా చలో అమరావతి అంటూ అక్కడే చక్కెర్లు కొడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు, బాబు దృష్టిలో పడేందుకు పావులు కదుపుతున్నారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు సంవత్సరాలు దాటింది.ఇప్పటికి ఒకసారి మాత్రమే మంత్రి వర్గాన్ని విస్తరించారు.అది కూడా లోకేష్ కోసమే మంత్రి వర్గాన్ని విస్తరించారన్న విమర్శలను కూడా ఎదుర్కొన్నారు.దాదాపు 16 నెలల క్రితం నారా లోకేష్ తోపాటు వైసీపీకి చెందిన ఆదినారాయణరెడ్డి, భూమా అఖిలప్రియ, సుజయకృష్ణ రంగరావు, అమర్ నాధ్ రెడ్డిలకు స్థానం కల్పించారు.
బీజేపీ -టీడీపీ బంధం తెగిపోయిన తరువాత రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నబీజేపీ మంత్రులు పైడికొండల మాణక్యాలరావు, కామినేని శ్రీనివాస్ లు కూడా కేబినెట్ నుంచి తప్పుకున్నారు.ఆ ఖాళీలు ప్రస్తుతం అలాగే ఉన్నాయి.

ఈ నెల 28వ తేదీన గుంటూరులో మైనారిటీల సదస్సు జరగబోతోంది.ఈ సదస్సుకు ముందే చంద్రబాబు తన కేబినెట్ లో మైనారిటీకి చెందిన వారికి చోటు కల్పించాలని భావిస్తున్నారు.ఈ విషయాన్ని పార్టీకి చెందిన కీలక నాయకులతో కూడా చర్చించినట్టు తెలుస్తోంది.ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలంటే ఎమ్మెల్సీగా ఎన్నికై ఇటీవల శాసనమండలి ఛైర్మన్ గా ఉన్న ఎన్.ఎం.డి.ఫరూక్ పేరు గట్టిగా విన్పిస్తున్నట్లు తెలుస్తోంది.మరో పేరు కదిరి ఎమ్మెల్యే చాంద్ భాషా పేరును వినిపిస్తున్నా.
ఆయన వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే కావడంతో కొంత ఆలోచనలో పడ్డారని చెబుతున్నారు.ఇక ఏపీలో పవన్ జోరు పెరగడంతో కాపు కులానికి చెందిన వ్యక్తికి కూడా మంత్రి పదవి ఇస్తే బాగుటుంది అనే ఆలోచనలో బాబు న్నాడు.
ఇక ఏపీ క్యాబినెట్లో గిరిజనులకు కూడా ప్రాధాన్యత లేకపోవడంతో పోలవరం ఎమ్యెల్యే మొడియం శ్రీనివాసరావు కి కూడా ప్రాధాన్యం దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.