కొన్ని సినిమాలు ఎంతో అద్భుతమైనటువంటి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి.ఇలా చిన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాలను అందుకున్నటువంటి సినిమాలు ఎన్నో ఉన్నాయని చెప్పాలి అలాంటి వాటిలో 12 th ఫెయిల్ ( 12th Fail ) సినిమా ఒకటి.
ఈ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది.విధు వినోద్ చోప్రా ( Vidhu Vinod Chopra )తెరకెక్కించినటువంటి ఈ సినిమా గత ఏడాది అక్టోబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ తెలుగులో మాత్రం పెద్దగా ఆదరణ పొందలేదని చెప్పాలి.
బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలను సైతం వెనక్కి నెట్టి ఈ సినిమా ఐఎండిబీ( IMDb ) లో భారీ స్థాయిలో రేటింగ్ కైవసం సొంతం చేసుకుంది.ఈ సినిమాకు ఏకంగా 9.5 రేటింగ్ ఇవ్వటం గమనార్హం.ఇక ఈ సినిమా తెలుగులో నవంబర్ మూడవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం పెద్దగా ఆదరణ సంపాదించుకోలేకపోయింది కానీ ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్( Disney Plus Hot Star ) లో ప్రసారం అవుతుంది.
ఇక ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమవుతున్నటువంటి తరుణంలో ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది.ఈ సినిమాపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.ఈ సినిమా హాలీవుడ్ చిత్రాలు అయినటువంటి స్పైడర్ మాన్, ఓపెన్ హైమర్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూ వంటి సూపర్ హిట్ హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి ఏకంగా 9.5 రేటింగ్ కైవసం సొంతం చేసుకొని టాప్ సినిమాగా నిలిచింది.ఇక ఇండియన్ సినిమాలలో టాప్ 250 సినిమాలలో ఈ సినిమా మొదటి స్థానంలో ఉండటం విశేషం.