సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో డైరెక్టర్ శంకర్ ( Shankar ) కూడా ఒకరు.ఈయన దర్శకత్వంలో ఏదైనా సినిమా రాబోతుంది అంటేనే ఆ సినిమాపై ఎన్నో అంచనాలు ఉంటాయి.
ఆ అంచనాలకు అనుగుణంగానే సినిమా కూడా భారీ స్థాయిలో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.ఇప్పటివరకు శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఇకపోతే ప్రస్తుతం ఈయన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ramcharan ) తో గేమ్ ఛేంజర్ ( Game Changer ) అనే సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా డైరెక్టర్ శంకర్ కి మధ్యలో కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ రావడంతో ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతుంది.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉందని తెలుస్తోంది.
ఇకపోతే ఈ సినిమాకు ఒకానొక సమయంలో డైరెక్టర్ మారిపోయారని శంకర్ కాకుండా ఆయన స్థానంలో మరొక డైరెక్టర్ సినిమాని తన చేతులలోకి తీసుకున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.అయితే ఈ వార్తలను వెంటనే దిల్ రాజు ( Dil Raju ) ఖండించారు.
అయితే ఆ డైరెక్టర్ మరెవరో కాదు దర్శకుడు శైలేష్ కొలను(Sailesh Kolanu) అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి.తాజాగా ఈయన వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ ( Saindhav ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల కాబోతున్నటువంటి తరుణంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు.ఈ ప్రమోషన్లలో భాగంగా డైరెక్టర్ పాల్గొన్నారు.

ఇంటర్వ్యూ సందర్భంగా ఈయనకు రాంచరణ్ గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.మీరు ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు అంటూ వార్తలు వచ్చాయి .అసలు ఏం జరిగింది అనే విషయం గురించి ప్రశ్న లేదు రావడంతో ఈ ప్రశ్నకు ఈయన సమాధానం చెబుతూ సాధారణంగా శంకర్ సార్ ఎవరిని కూడా అంత ఈజీగా తన సినిమాలలోకి ఇన్వాల్వ్ అవ్వనివ్వరు ఆయన సినిమాలో ఎవరైనా ఇన్వాల్వ్ కావాలి అంటే వారికి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది కానీ ఒకసారి వారు షూటింగ్ నిమిత్తం స్ట్రక్ అయ్యారు.

ఇలా కావడంతో దిల్ రాజు గారికి శంకర్ ఫోన్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డైరెక్టర్ల చేత బీరవల్ సన్నివేశాలను షూట్ చేయించమని చెప్పారు.బీరువల్ సన్నివేశాలు అంటే వెహికల్ పాసింగ్ సీన్స్ డ్రోన్ తో తీసే షార్ట్స్ అన్నింటిని కూడా చేయాల్సి ఉంటుంది కానీ అక్కడ ఎవరు మనుషులు కానీ ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ ఉండరు అలాంటి సన్నివేశాలను చేయాల్సి రావడంతో దిల్ రాజు గారు నాకు ఫోన్ చేయడంతో రెండు రోజులు పాటు ఈ సినిమా షూటింగ్లో పాల్గొన్న తప్ప ఈ సినిమాకు నేను అసలు షూట్ చేయలేదని కానీ శంకర్ సార్ నాకు ఈ అవకాశం ఇవ్వడం నిజంగా గ్రేట్ అనిపిస్తుంది అంటూ ఈయన తెలిపారు.







