మనిషి పుట్టుక నుండి మరణం దాకా సాగే ప్రయాణమే జీవితం.చూడగలిగితే ప్రతి జీవితం ఓ అద్భుతమే.
చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే.మనం జీవితంలో చేసే ఒక్క మంచి పనైనా సరే కొన్ని వందల ఏళ్ళు మన గురించి మాట్లాడుకునేలా చేస్తాయని అంటారు మన పెద్దలు.
అలా 11 ఏళ్ళ వయస్సులోనే ప్రపంచానికి నిజమైన హీరో అని నిరూపించాడు ఈ కుర్రాడు.
హృదయాన్ని కాస్త బాధపెట్టేదే అయినా కొన్ని కోట్ల మందికి ఆదర్శంగా నిలిచాడు.చైనాకు చెందిన ఈ అబ్బాయి పేరు లియాంగ్ యోయి.9 ఏళ్ళ వయస్సు నుండి బ్రెయిన్ ట్యూమర్ సమస్యతో బాధపడుతున్నాడు.ఇంకా ఎంతో కాలం బ్రతకడం కష్టమని డాక్టర్లు తేల్చిచెప్పారు.

రెండేళ్ల తర్వాత ఈ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి తీవ్రమైంది.డాక్టర్లకు కూడా ఈ విషయం చెప్పారు కుటుంబ సభ్యులు.ఆ అబ్బాయి తీసుకున్న నిర్ణయానికి హర్షించారు.11 ఏళ్ళ లియాంగ్ యోయి లివర్, కిడ్నీలను వేరేవాళ్లకు ట్రాన్స్ఫర్ చేసి బ్రతికించారు.లియాంగ్ యోయి స్ట్రెచర్ పై ఉండగా ఆ హాస్పిటల్ డాక్టర్లు తల కిందకు ఉంచి హ్యాట్సాఫ్ తెలిపారు.