ఈ-2 , ఈబీ-5 వీసాలు అంటే ఏమిటి..? గోల్డెన్ వీసా పొందటం ఎలా..?

అమెరికాలో స్థిరపడాలి అనుకునే వారికి అక్కడి ఇమ్మిగ్రేషన్ వారు వివిధ రకాల వీసాలని జారీ చేస్తూ ఉంటారు.అమెరికా వెళ్ళిపోయి అక్కడి దేశ పౌరసత్వం సంపాదించడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటారు.

 2 5-TeluguStop.com

వీరులో ముఖ్యులు మన మన భారతీయులు అమెరికా లాంటి దేశంలో ఎన్నిరకాల వీసాలున్నఈ నేపథ్యంలో గోల్డెన్ వీసా ఇప్పుడు వెలుగులోకి వస్తోంది అసలు ఈ గోల్డెన్ వీసా అంటే ఏమిటి.? అసలు ఈ-2, ఈబీ-5.వీసాలు అంటే ఏమిటి వాటి ఉపయోగం ఏమిటో తెలుసుకుందాం

అమెరికాలో వీసాలు అనేకరకాలుగా ఉంటాయి కొన్ని ఉద్యోగాలు, కోసం మరి కొన్ని చదువులకోసం ఇలా ఎన్నో రకాలుగా ఉన్నాయి.అయితే గడిచిన కొంత కాలంగా అమెరికాలో గ్రీన్ కార్డు పొందారు…అయితే అమెరికాలో గ్రీన్ కార్డు పొందటం అంటే పెట్టుబడులు సైతం పెట్టాల్సి ఉంటుంది అయితే ఈ గ్రీన్ కార్డుని రెండు రకాలుగా పొందవచ్చు

మొదటిది ఈ-2 వీసా, రెండోది ఈబీ-5 ఇన్వెస్టర్ వీసా

ఈ ఈ-2 వీసాలను అమెరికా కొన్ని ఎంపిక చేసిన దేశాలకు మాత్రమే ఇస్తుంది.భారత్, చైనా దేశస్థులు ఈ వీసా పొందేందుకు అర్హులు కారు…దీన్నే గోల్డెన్ వీసా అంటారు.అమెరికా విదేశాంగ శాఖ అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ వీసాల కోసం ఎంక్వయిరీలు చేసే వారిలో మొదటి స్థానంలో పాకిస్థాన్ ఉంటే, రెండో స్థానంలో భారత్ ఉంది

ఏటా అమెరికా పదివేల వరకు ఈబీ-5 వీసాలు జారీ చేస్తుంది.

అయితే ఒక్కో వీసా కోసం 23 వేలకు పైగా దరఖాస్తులు వస్తుంటాయి.అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గత ఏడాది 174 మంది భారతీయులకు ఈబీ-5 వీసాలు మంజూరు చేశారు.


అయితే ఈబీ -5 వీసాలో కనీసం ఐదు లక్షల డాలర్లు అంటే మూడున్నర కోట్ల రూపాయల పెట్టుబడులు ఆ దేశంలో పెట్టాలి.పెట్టుబడులు పెట్టగానే సరిపోదు, పది మంది అమెరికన్లకు ఉద్యోగాలు కల్పించాలి.

మీ పెట్టుబడుల పై రాబడికి ఎటువంటి గ్యారంటీ ఉండదు.అలాగే ఈబీ-5 వీసాకు దరఖాస్తు చేసుకున్న వ్యక్తి కనీసం ఆరు నెలలైనా అమెరికాలో నివాసం ఉండాలి…అయితే కేవలం ఈ ఒక్క ఈబీ-5 వలన అమెరికా ఖజానాకి పెట్టుబడుల రూపంలో బాగానే ముడుతోందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube