పూజించడం వెనుక ఒక్కొక్కరికి ఒక్కో కారణం ఉంటుంది.హిందువుల్లో అధిక శాతం మంది నిత్యం తమ తమ ఇష్ట దేవుళ్లను, దేవతలను పూజిస్తారు.
అయితే కేవలం దేవుళ్లు, దేవతలే కాదు, వారితోపాటు చనిపోయిన తమ పూర్వీకుల ఫొటోలను కూడా పూజ గదిలోనో, దేవుళ్ల పక్కనో ఉంచి, వాటికి కూడా నిత్యం నమస్కరించుకుంటూ ఉంటారు.చనిపోయిన వారిని దైవంగా భావించి ఇలా పూజించడంలో తప్పేమీ లేదు.
కానీ దేవుడి దగ్గర, పూజ గదిలో చనిపోయిన వారి ఫొటోలను మాత్రం ఉంచకూడదట.ఎందుకో తెలుసా?

ఇలా చేస్తే దేవుళ్లకు కోపం వస్తుందట.ఇందుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.వాస్తు శాస్త్రం ప్రకారం చనిపోయిన వారి ఫొటోలను పూజ గదిలో ఉంచడం సరికాదు.
దీంతో సదరు కుటుంబానికి మంచి జరగదట.ఇండ్లలో ఈశాన్య దిశగా పూజ గదిని, నైరుతి దిశగా చనిపోయిన వారి ఫొటోలను ఉంచాలని వాస్తు సిద్ధాంతం చెబుతోంది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఆ ఇంట్లోకి నెగటివ్ శక్తి ప్రసారమవుతుంది.అంతే కాదు ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా మానసిక ప్రశాంతత ఉండదు

చనిపోయిన వారి ఫొటోలను దేవుళ్ల పక్కనే ఉంచి పూజ చేయడం హిందూ ధర్మం ప్రకారం పెద్ద తప్పిదమే అవుతుంది.మనిషి ఎల్లప్పుడూ దేవుడితో సమానం కాదని, నియమాలను అతిక్రమించి అలా చేస్తే ఆ కుటంబంలో కష్టాలు ఎదురవుతాయని నమ్మిక.