కిరణ్ అబ్బవరం 'సమ్మతమే' ఫస్ట్ సింగల్ విడుదల

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో కిరణ్ అబ్బవరం విభిన్న కథలను ఎంచుకుంటున్నారు.రాజా వారు రాణి గారు రస్టిక్ అండ్ రోమాంటిక్ డ్రామా కాగా.

 Young Hero Kiran Abbavarams Sammathame Movie First Single Released Details, Youn-TeluguStop.com

ఎస్ఆర్ కళ్యాణమండపం రోమాంటిక్ యాక్షన్ డ్రామా.ఆ రెండూ కూడా కమర్షియల్‌గా విజయాన్ని సాధించాయి.

ఇక ఇప్పుడు కిరణ్ అబ్బవరం మ్యూజికల్ రోమాంటిక్ ఎంటర్టైనర్ ‘సమ్మతమే’ అంటూ అర్బన్ బ్యాక్ డ్రాప్‌లో రాబోతోన్నారు.

ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించారు.కృష్ణ అండ్ సత్యభామ అంటూ సాగే మొదటి పాటను విడుదల చేశారు.

కృష్ణ సత్యభామల మధ్య ఉండే ప్రేమను చూపించేలా.కిరణ్ చాందినీల మధ్య రోమాంటిక్ ట్రాక్‌ను ఈ పాటలో అద్భుతంగా చూపించేశారు.

శేఖర్ చంద్ర అందించిన మెలోడి ట్యూన్ ఆకట్టుకుంటోంది.కృష్ణ కాంత్ సాహిత్యం యూత్‌ను మెప్పించేలా ఉంది.

యాజిన్ నాజిర్, శిరీష భగవతుల గాత్రం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి సరికొత్త ప్రేమకథతో రాబోతోన్నట్టు కనిపిస్తోంది.

ఫస్ట్ గ్లింప్స్‌, పాటతో సినిమా మీద పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి.

Telugu Gopinath Reddy, Sammathame, Ug, Youngkiran-Movie

తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.హీరో హీరోయిన్ల కారెక్టర్‌లో ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది.హీరో కిరణ్ అబ్బవరం సైలెంట్, కూల్ అండ్ సాఫ్ట్‌గా కనిపిస్తే.

హీరోయిన్ చాందినీ చౌదరి మాత్రం మందు, దమ్ము కొడుతూ చిల్ అవుతోంది.

యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కంకణాల ప్రవీణ నిర్మిస్తున్న సమ్మతమే షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

సతీష్ రెడ్డి సినిమాటో గ్రాఫర్ గా  వ్యవహరిస్తున్నారు.త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.

నటీనటులు :

కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరి తదితరులు.

సాంకేతిక బృందం

స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : గోపీనాథ్ రెడ్డి నిర్మాత : కంకణాల ప్రవీణ బ్యానర్ : యూజీ ప్రొడక్షన్ మ్యూజిక్ డైరెక్టర్ : శేఖర్ చంద్ర డీఓపీ : సతీష్ రెడ్డి మాసం ఎడిటర్ : విప్లవ్ నైషదం ఆర్ట్ డైరెక్టర్ : సుధీర్ మాచర్ల పీఆర్వో : వంశీ-శేఖర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube