తెరదించిన యడ్యూరప్ప.. రాజీనామా..! సిఎం పగ్గాలు ఎవరికి..

కర్ణాటక రాజకీయాలు వేడెక్కుతున్నాయి.కర్ణాటకలో రాజకీయాలు ఒక్కరోజులోనే మారిపోయాయి.

 Yedyurappa Submitted His Resign Letter Over Cm Post To Governor In Karnataka Raj-TeluguStop.com

ఇంతవరకు సీఎం కుర్చీ నుంచి దిగేది లేదని తెగేసి చెప్పిన యడ్యూరప్ప స్వరం మార్చారు.అధిష్టానం ఆదేశాల శిరోధార్యమని గురువారం మీడియా ముందు ప్రకటించి వేడెక్కుతున్న రాజకీయాలకు తెరదించారు.

బిజెపి వర్గాల సమాచారం మేరకు వచ్చే సోమవారం రెండేళ్ల పాలనపై సభ కాగానే  యడ్యూరప్ప రాజభవన్ కి వెళ్లి గవర్నర్  కలిసి రాజీనామా లేఖను సమర్పించనున్నారు. యడ్యూరప్ప స్థానం లో పార్టీలో సీనియర్ నాయకుడిని అధిష్ఠానం ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 26న రెండేళ్ల పాలన సాధన సమావేశం నిర్వహిస్తాం ఆపై అధిష్టానం సూచించినట్లు నడుచుకుంటాను యడ్యూరప్ప తెలిపారు.నాకోసం రెండేళ్ల పాటు పెద్దలు వెసులుబాటు ఇచ్చారు దీనిపై ఎవరూ ఆందోళన చెందవద్దని యడ్యూరప్ప పేర్కొన్నారు.

మరోవైపు ఎడ్యూరప్ప మద్దతుదారులు మంత్రులు, ఎమ్మెల్యేలు ఏం చేయాలా అనే వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నారు. సిఎం పగ్గాలు ఎవరికి.!? ముఖ్యమంత్రి పగ్గాలు ఎవరు పెట్టనున్నారనే అంశంపై పలువురు పేరు చక్కర్లు కొడుతున్నాయి.మరి సిఎం రేసులో ఎవరు.

ఎవరు.ఉన్నారో సిఎం పగ్గాలు ఎవరు పట్టనున్నారో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube