ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ ట్విట్టర్ అకౌంట్ కొద్దిరోజుల క్రిందట హ్యక్ అయిన సంగతి తెలిసిందే.ఆ సమయంలో హ్యాకర్లు వైసీపీ పార్టీ లోగో మార్చడంతో పాటు క్రిప్టో కరెన్సీ పోస్టులు పోస్ట్ చేశారు.
ప్రొఫైల్ పిక్ లో కోతి బొమ్మ పెట్టడం జరిగింది.శుక్రవారం అర్ధరాత్రి హ్యాకింగ్ కి గురైన క్రమంలో వైసీపీ సాంకేతిక బృందం వెంటనే అలర్ట్ అయ్యి… టెక్నికల్ సపోర్ట్ టీం సహకారంతో ఈరోజు ఎట్టకేలకు వైసీపీ ఖాతాను పునరుద్ధరించడం జరిగింది.
వెంటనే వైసీపీ స్పందించి తొలి ట్వీట్ చేసింది.
గత 36 గంటల పాటు కొన్ని అవాంతరాల కారణంగా… ట్విట్టర్ ఎకౌంటు హ్యాక్ అయింది.
ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించడం జరిగింది.ఈ క్రమంలో సహాయం చేసిన ట్విట్టర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు అని వైసీపీ ఫస్ట్ ట్విట్ చేయడం జరిగింది.
ఇప్పటికే వచ్చే సార్వత్రిక ఎన్నికలను వైసీపీ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి.175కి 175 టార్గెట్ పెట్టుకొని పార్టీ క్యాడర్ లకి దిశా నిర్దేశం చేస్తున్నారు. ట్విట్టర్ అకౌంట్ మళ్ళీ పునరుద్ధరణ చెందటంతో వైసీపీ క్యాడర్ ఫుల్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.