ఆరాధ్య ఫౌండేషన్ సహకారంతో పోస్టల్ ప్రమాద భీమా

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఆరాధ్య ఫౌండేషన్ సహకారంతో 8వేల మందికి పోస్టల్ ప్రమాద భీమా పాలసీలు అందించామని తెలంగాణ ఉద్యమకారులు,ఫౌండేషన్ చైర్మన్ తాడోజు వాణి శ్రీకాంత్ రాజ్ తెలిపారు.ఆదివారం మద్దిరాల మండల కేంద్రంలో నిర్వహించిన బీమా పాలసీల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై ప్రజలకు పాలసీ పాత్రలను అందజేశారు.

 Postal Accident Insurance In Collaboration With Aradhya Foundation-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు వచ్చినా పేద ప్రజలకి ఆరాధ్య ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తామని అన్నారు.ఆరాధ్య ఫౌండేషన్ కి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధాలు లేవని,ప్రతి పేదవారికి అండగా ఉండడమే మా లక్ష్యమని తెలిపారు.

తెలంగాణ విద్యార్థి ఘనపరిషత్ అధ్యక్షురాలు తాడోజ్ వాణి మాట్లాడుతూ మేము స్థాపించిన ఆరాధ్య పౌండేషన్ పేద ప్రజలకు అండగా ఉంటుందని,మేము సంపాదించే దాంట్లో పేదవారికి సహాయం చేయడం మాకెంతో సంతృప్తిని ఇస్తుందన్నారు.ప్రజా కళాకారుడు గిద్దే రామనర్సయ్య మాట్లాడుతూ “ప్రార్థించే చేతుల కన్నా- సహాయం చేసి చేతులు మిన్న”అన్నారు.

వ్యవస్థ ఒక్కరితోనే మొదలవుతుందని, కానీ,దానికి మనమందరం తోడుగా ఉంటే శక్తి అవుతుందని,అది అందరితో కలిసి ఒక ప్రభంజనంలా మారుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పోస్టల్ ఆఫీసర్ ఆంజనేయులు, పోస్టల్ డిపార్ట్మెంట్ సిబ్బంది,ఆరాధ్య ఫౌండేషన్ సభ్యులు,పత్తేపురం విజయ్, కట్టుకోజు నాగరాజు,తేలుకుంట్ల అంజయ్య,మహేష్,బద్రి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube