ఏపీలో ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.ఈ మేరకు వైసీపీ, ( YCP ) టీడీపీ( TDP ) పోటాపోటీగా ఫిర్యాదులు చేస్తున్నారు.
విజయవాడలోని నోవాటెల్ ఉన్న ఈసీ బృందాన్ని వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి,( Vijayasai Reddy ) మార్గాని భరత్( Margani Bharat ) కలిశారు.ఓటర్ల జాబితాలోని అవకతవకలపై ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఇక టీడీపీ అధినేత చంద్రబాబు,( Chandrababu ) జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఈసీ బృందాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు.రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయనున్నారని తెలుస్తోంది.అయితే ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా చర్యలు తీసుకున్నామని చెప్పిన సంగతి తెలిసిందే.