రాజకీయ పార్టీలు ఒక్కో పరిస్థితుల్లో ఒక్కో రకంగా వ్యవహరిస్తుంటాయి.అందుకే సాధ్యాసాధ్యాలు ఉండవనే అంటారు.
అప్పటి పరిస్థితులను బేస్ చేసుకుని రాజకీయంగా ముందుకు వెళ్తుంటారు.ఓ ప్రత్యేక నినాదంతో ప్రజల్లోకి వెళ్తుంటారు.
సెంటిమెంటు.సానుభూతి అనే రెండు పట్టాలపైనే రాజకీయాలు నాయకులు కూడా ప్రయాణం చేస్తున్నారు.
గతంలో తెలంగాణ సీఎం సెంటిమెంట్ రగిల్చి వెళ్లినవారే.ఇక ప్రస్తుత జనసేన అధినేత పవన్ కూడా ఏపీలో ఇలాగే సెంటిమెంట్ ని వాడుకోబోతున్నారని అంటున్నారు.
తాజాగా తాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాటలో రాజకీయాలు చేస్తానని.ఆ యన లాగానే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తానని వ్యాఖ్యలు చేశారు పవన్.పార్టీ నాయకులతో నిర్వహించిన సమావేశం లో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.దీంతో అసలు.
కేసీఆర్ అనుసరించిన రాజకీయాలు ఏంటి? అనే చర్చ తెరమీదికి వచ్చింది.ఆయన ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు అనుసరించారో ఏమో కానీ.
ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు వచ్చినా తెలంగాణ సెంటిమెంటును బలంగా రెచ్చగొట్టారు.
కేసీఆర్ వ్యూహాలకన్నా.
సానుభూ తి.సెంటిమెంటుకే ప్రాధాన్యం ఇస్తారు ప్రజా నాడి ఏంటో బాగా తెలిసిన వ్యక్తి గనుక తమదైన శైలిలో ముందుకు వెళ్తుంటారు.అదే ఆయనను రెండో సారి గద్దెనెక్కేలా చేసింది.అయితే ఇప్పుడు ఇదే ఫార్ములా జనసేన అధినేత పవన్ కూడా అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది.అంటే పవన్ కూడా సానుభూతి.సెంటిమెంట్ తో తనవైపు తిప్పుకోవాలి.
అయితే ఇప్పటికిప్పుడు ఏపీలో ఎలాంటి సెంటిమెంట్ రెచ్చగొట్టాలంటే పెద్గగా ఏమీ కనబడదు.ప్రత్యేక హోదా పట్టుకుందామన్న పవన్ ఎప్పుడో వదిలేసిన అంశం.
దీంతో ఇప్పుడు చిరంజీవి అస్త్రాన్ని తెరమీదకి తెచ్చినట్టు కని పిస్తోందని అంటున్నారు రాజకీయ పండితులు.

చిరంజీవి అంటే అభిమానం చిరు అంటే రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అభిమానించే హీరో.ఇప్పుడు ఈయనకు అగౌరవం జరిగిందని.సాక్షాత్తూ.
సీఎం జగన్..
అవమానించా రని నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా పెట్టలేదని వ్యాఖ్యానించారు.అంతేకాదు చిరును రాజకీయంగా భూస్థాపితం చేసిన వారు ఇప్పుడు వైసీపీలోనే ఉన్నారని చెప్పారు.
దీంతో పవన్ చిరు విషయంలో సెంటిమెంటును రగిలించే ప్రయత్నం చేశారనే అంటున్నారు.కానీ చిరంజీవి పవన్ కల్యాణ్ రాజకీయంగా ఒకే వేదికపై ఇప్పటి వరకు చూడని అభిమానులు ఈ సెంటిమెంటుకు కనెక్ట్ అవుతారో లేదో చూడాలి.
ఇది వర్కౌట్ కావాలంటే చిరు ఫ్యామిలీ కూడా చిరుకు జరిగిన అవమానం చెప్పుకుంటే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.