సోషల్ మీడియా( Social Media )లో ఫేమస్ అయ్యేందుకు కొందరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.తెలిసి చేస్తున్నారో లేక అమాయకత్వమో అర్ధం కావడం లేదు.
రోడ్లపై ప్రమాదకర స్టంట్లు చేసి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.ప్రమాదాలు జరుగుతాయని తెలిసి కూడా కొందరు నిర్లక్ష్యంగా స్టంట్స్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
లైకులు, షేర్లు మాట అటుంచితే పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి కటకటాల వెనుకకు పంపుతున్నారు.అంతేకాకుండా భారీగా ఫైన్లు కూడా విధిస్తున్నారు.
ఇలాంటివి నిత్యం మనం వార్తల్లో చూస్తున్నాం.అయితే జరిగే పరిణామాలను ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రమాదకర స్టంట్స్( Dangerous Stunts ) చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది.
తాజాగా యూపీ( UP )లో ఇలాంటి ఓ ఘటన జరిగింది.ప్రియురాలిని భద్రతను ఏ మాత్రం పట్టించుకోకుండా ఓ యువకుడు చేసిన పని విమర్శలకు తావిస్తోంది.
దీనిపై పోలీసులు కూడా దృష్టి సారించారు.కేసు నమోదు చేసి వారి కోసం గాలిస్తున్నారు.
దీని గురించి తెలుసుకుందాం.ఓ యువతి కారుకు వేలాడుతూ ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
దీనిని మంగళవారం ఎక్స్ (ట్విటర్)లో చాలా మంది యూజర్లు షేర్ చేశారు.ఆ వీడియోలో కారుపై అడ్వొకేట్ అని గుర్తు కూడా ఉంది.ఆ కారుకు ఓ యువతి బయట నుంచి వేలాడుతోంది.కారు లోపల నుంచి ఓ యువకుడు ఆమెతో కబుర్లు చెబుతున్నాడు.ఒక వేళ పట్టు తప్పి ఆ యువతి పడిపోతే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.అయితే ఈ విషయాన్ని కారులో ఉన్న యువకుడు ఏ మాత్రం పట్టించుకోలేదు.
చాలా దూరం వీరు కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణించారు.తన గురించి కూడా ఆ యువతి కొంచెం కూడా పట్టించుకోలేదు.రోడ్లపై ఇలాంటి స్టంట్లు చేస్తే ప్రాణాలు కోల్పోతామనే స్పృహ ఆమెకు కూడా లేదు.తన ప్రియుడికి తగ్గట్టు ఆమె ప్రవర్తించింది.
లక్నో నగరంలోని ప్లాసియో మాల్ ( Palassio Mall )సమీపంలో ఈ వీడియోను కారు వెనుక ప్రయాణిస్తున్న కొందరు చిత్రీకరించారు.దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా బాగా వైరల్ అయింది.
అదే సమయంలో కారులో ఉన్న యువకుడు, కారుకు వేలాడుతున్న యువతిపై పలువురు విమర్శలు చేశారు.ఇలాంటి పనులు చేసి, ఇతరులను ఇలా చేయాలని ప్రేరేపిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఇక ఈ వీడియోపై లక్నో పోలీసులు కూడా స్పందించారు.కారు నంబర్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ అంజనీకుమార్ మిశ్రా తెలిపారు.