ముఖ్యంగా చెప్పాలంటే ముస్లింలకు పవిత్రమైన రంజాన్ నెల( Ramzan Month ) మొదలైంది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ మాసంలో కఠినమైన ఉపవాస దీక్షలు చేపడతారు.
దేవునికి దగ్గరగా ఉండేందుకు సన్మార్గంలో నడిచేందుకు ఇది విలువైన మార్గంగా భావిస్తారు.అలాగే నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు( Fasting ) చేపట్టి ఆ తర్వాత ఈద్ ఉల్ ఫితర్ ను వైభవంగా జరుపుకుంటారు.
రంజాన్ నెల ముస్లింలకు ఎంతో విలువైనది.అల్లా ఆశీర్వాదం కోసం ప్రత్యేక ప్రార్థనలు కూడా చేస్తారు.
రంజాన్ నెల ప్రారంభమైన నేపథ్యంలో ఈ పవిత్ర మాసంలో ముస్లింలు చేయవలసిన, చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ముస్లింలు రోజుకు కనీసం ఐదు సార్లు ప్రార్థనలు చేయాలి.
మంచి జీవితం కోసం అంతకు మించి కూడా చేసుకోవచ్చు.పవిత్ర రంజాన్ మాసంలో పేదలకు తమకు వీలైనంతవరకు ఎక్కువ దానధర్మాలు చేయాలి.
రంజాన్ నెల ఉపవాసాన్ని తెల్లవారుజామున సెహ్రీతో( Sehri ) మొదలుపెట్టాలి.సాయంత్రం ఇఫ్తార్ తో( Iftaar ) ఉపవాసాన్ని ముగించాలి.
ముస్లింలు తమ పవిత్ర గ్రంథం ఖురాన్ ను( Quran ) పఠించాలి.అలాగే కంఠస్థం చేయాలి.
చదివిన శ్లోకాలను విశ్లేషించుకోవాలి.నిజ జీవితంలో వాటిని అమలు చేయాలి.
ముస్లింలు అల్లాహ్‌ను ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తెలిపే ‘ధిక్ర్’ పఠించాలి.ఉపవాసం పాటించేటప్పుడు ఇతరులతో మర్యాదగా, ఓపికగా ఉండాలి.ముస్లింలు ప్రార్థనలు చేసేటప్పుడు వారి కుటుంబాల శ్రేయస్సును కోరుకోవాలి.ముస్లింలు నెలరోజుల పవిత్రమైన ఉపవాస సమయంలో బ్రహ్మచర్యాన్ని కొనసాగించాలి.ఈ మాసంలో ఉపవాసంలో ఉన్న ముస్లింలు మగ్రిబ్ అజాన్ ముందు వరకు ఏమి తినకూడదు.తాగకూడదు.
అలాగే ధూమపానం, మద్యపానం అస్సలు చేయకూడదు.బలవంతంగా వాంతులు చేసుకోకూడదు.
పవిత్రమైన రంజాన్ మాసంలో ఇతరులతో వాదించడం, గొడవ పడడం అస్సలు చేయకూడదు.దీనికి బదులుగా శాంతి, సానుకూల చర్యలను పెంపొందించడం పై దృష్టి పెట్టాలి.ఈ పవిత్రమైన మాసంలో ఉపవాసం ఉన్నవారు మ్యూజిక్ వినడం,సినిమాలు చూడడం లాంటి పనులు అసలు చేయకూడదు.అలాగే మనసులో చెడు ఆలోచనలు రాకుండా ఉండాలి.మహిళలు గర్భవతిగా ఉన్నప్పుడు లేదా పిల్లలకు పాలు ఇవ్వడం, రుతుక్రమం, అలాగే ఎవరైనా వ్యాధులతో బాధపడుతున్న సమయంలో ఉపవాసాలను పాటించడం మానుకోవాలి.అలాగే ఉపవాసం విరమించడం ఆలస్యం చేయకూడదు.
LATEST NEWS - TELUGU