ఇటీవల ఇళ్లల్లో చాలామంది పెంపుడు జంతువులను పెంచుకుంటున్నారు.కుక్కలు, పిల్లులు, కుందేళ్లు ( Dogs, cats, rabbits )లాంటి వాటిని పెంచుకుంటారు.
ఎక్కువమంది వివిధ జాతికి చెందిన పెంపుడు కుక్కలను పెంచుకుంటూ ఉంటారు.వాటికి ఆహారం అందిస్తూ, బయటకు వాకింగ్ కు తీసుకొస్తూ, ట్రావెలింగ్ చేసేటప్పుడు వాటిని కూడా కారులో తీసుకెళ్తూ సొంత కుటుంబసభ్యుల్లా చూసుకుంటారు.
ఇంట్లో వాటితో సరదాగా ఆడుకుంటూ సమయం గడుపుతారు.అయితే కుక్కలు కూడా ఇంట్లో వారి పట్ల ప్రేమను చూపిస్తూ ఉంటాయి.
వాళ్లు ఎక్కడికి వెళ్తే వారి వెంట పరిగెడుతూ ఉంటాయి.

కుటుంబసభ్యులకు చాలా పనుల్లో కుక్కలు హెల్ప్ చేస్తూ ఉంటాయి.తాజాగా రోడ్డుపై చెత్త ఏరుకునే ఒక మహిళకు పెంపుడు కుక్క ( pet dog )సహాయం చేసింది.మహిళ( woman ) రోడ్డుపై చెత్త ఏరుకుంటూ ఒక పెద్ద బ్యాగ్ లో వాటిని వేసుకుంటుంది.
పెద్ద బ్యాగ్ ను భూజాన వేసుకుని రోడ్డుపై చెత్త ఏరుకుంటుంది.అయితే మహిళకు కుక్క సహాయం అందిస్తుంది.కుక్క కూడా ఆమె వెనుక ఉండి బ్యాగ్ ను మోస్తుంది.మహిళకు బ్యాగ్ బరువు అవుతుందేమోనని అర్థం చేసుకుంటూ ఆమె వెనుక ఇలా బ్యాగ్ ను మోస్తూ ఉంది.

ది ఫైజెన్ ( The Faizen )అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు.ఇప్పటివరకు ఈ వీడియోకు 9 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి.ఈ సంఘటన ఢిల్లీలో చోటుచేసుకున్నట్లు తెలుస్తంది.ఈ వీడియోలో మహిళకు కుక్క చేస్తున్న సహాయం చేసి అందరూ ముచ్చటపడుతున్నారు.యజమాని పట్ల కుక్క చూపించే ప్రేమ ఇలాగే ఉంటుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు.యజమాని కోసం నమ్మకంగా కుక్క పనిచేస్తుందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మనుషులకు బెస్ట్ ఫ్రెండ్స్ కుక్కలేనని మరో నెటిజన్ కామెంట్ చేశారు.ఇలా నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.







