సినిమా పరిశ్రమలో ఒక్కొక్కరు ఒక్కోలా ముందుకు వెళ్తుంటారు.అలాగే అవికా గోర్, శ్వేతా బసు ప్రసాద్ కూడా టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు పొందారు.
బాల నటులుగా ఒకప్పుడు వెలుగు వెలిగిన ఈ అమ్మాయిలు.ప్రస్తుతం సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు.
చిన్న వయసులో పెద్ద స్టార్ డమ్ అనుభవించిన ఈ ముద్దుగుమ్మలు పెద్దయ్యాక డిమాండ్ తగ్గి మరుగున పడుతున్నారు.ఇంతకీ వీరిద్దరికి ఉన్న కామన్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా తెలుగు జనాలకు ఎంతో దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ.అప్పట్లో ఈ సీరియల్ చూడని తెలుగు జనాలు లేరంటే ఆశ్చర్యం కలగక మానదు.
చిన్నప్పుడే బాల నటిగా ఎంతో మంది అభిమానం సంపాదించుకుంది.ఆ తర్వాత ఉయ్యాలా జంపాలా చిత్రంలో తెలుగు వెండితెరకు పరిచయం అయ్యింది.
తొలి సినిమాతోనే మంచి విజయం సాధించింది.అవికా ఆ తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది-3 సహా పలు సినిమాల్లో నటించింది.
అయితే నటిగా మంచి గుర్తింపు పొందినా స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేదు.అటు బాలీవుడ్ లోనూ సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
అటు సినిమా కథలు కూడా రాస్తున్నట్లు తెలుస్తుంది.
![Telugu Avika Gor, Bollywood, Common, Kottabangaru, Raju Gari Gadhi, Serials, Tol Telugu Avika Gor, Bollywood, Common, Kottabangaru, Raju Gari Gadhi, Serials, Tol](https://telugustop.com/wp-content/uploads/2021/06/common-points-in-avika-gor-and-the-swetha-basu-prasad.jpg )
మరో బొద్దుగుమ్మ శ్వేతా బసు ప్రసాద్ సైతం బాల నటిగానే బుల్లితెరకు పరిచయం అయ్యింది.పలు సీరియల్స్ లో నటించి సత్తా చాటింది.అనంతరం వెండితెరపై సందడి చేసింది.
బాల నటిగా నేషనల్ అవార్డును సైతం అందుకుంది.హిందీలో మకిడీ అనే సీరియల్ చేసి.
ఎంతో మంది అభిమానులను పొందింది.కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టింది.ఈ సినిమాతో పలు సినిమాల్లో అవకాశం వచ్చింది.
కానీ ఆ సినిమాలు అంతగా పేరు తీసుకు రాలేదు.అటు బాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తూనే ఉంది.
బుల్లితెరపై సీరియల్స్ లోనూ నటిస్తుంది.ఈ ముద్దుగుమ్మ దర్శకురాలిగా చేసేందుకు రెడీ అవుతుందట.