గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.దేవదాసు సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ బ్యూటీ.
ఆ తర్వాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది.మహేష్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పోకిరి’లో నటించి ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్‌గా మారింది.
ఆ తరువాత టాలీవుడ్ లో పలువురు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది.ఒకప్పుడు తన అందచందాలతో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది.
ఒకవైపు టాలీవుడ్ సినిమాలలో నటిస్తూనే మరోవైపు బాలీవుడ్ సినిమాలలో కూడా నటించింది. బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అందులో భాగంగా ఈ భామ అక్కడ బర్ఫీ,పటా పోస్టర్ నిఖలా హీరో,మెయిన్ తెరా హీరో, రుస్తుం లాంటీ సినిమాల్లో నటించి మంచి సూపర్ హిట్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తర్వాత ఆమెకు అక్కడ సరైన అవకాశాలు లేకపోవడంతో తెలుగులో రవితేజ హీరోగా నటించిన అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇక అప్పట్లో అయితే ఎక్కడ చూసినా కూడా ఇలియానా మానియా కనిపించేది.

ఆ తరువాత ఈమె సినిమాలకు దూరం అయ్యింది.సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.ఇకపోతే ఇలియానా నడుముకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఇలియానా తన నాజూకు నడుముతో తెలుగు కుర్రాళ్ళ కలల రాణిగా మారింది.కోట్లాదిమంది అభిమానుల మనసులలో చోటు సంపాదించుకుంది.
అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంది.అయితే సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ ఫోటోలు నిత్యం సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది.
అలాగే రోజు రోజుకి తన అందాన్ని మరింత పెంచుతోంది ఇలియానా.ఇలా ఉంటే తాజాగా ఇలియానా తన తల్లి తో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.