క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్, మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీప్రసాద్ కాంబినేషన్లో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.డిసెంబర్ 17 వ తేదీ విడుదల అయిన ఈ సినిమా అన్ని భాషలలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.
అలాగే ఈ సినిమాలో మొట్టమొదటిసారిగా ఐటమ్ సాంగ్ లో సమంత నటించడం విశేషం.ఈ పాట ద్వారా సమంత ఒక రేంజ్ లో డాన్స్ చేసి ఈ సినిమాకి మరింత విజయాన్ని చేకూర్చిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
సమంత నటించిన ఈ పాట ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.ఇలా ఎంతో మంది సమంత ఐటమ్ సాంగ్ పై ప్రశంసలు కురిపించారు.
ఈ క్రమంలోనే నటి రకుల్ ప్రీత్ సింగ్ సమంత ఐటమ్ సాంగ్ పై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ పుష్ప సినిమా ఎంతో అద్భుతంగా ఉందని ఇందులో నటించిన ప్రతి ఒక్కరు అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేశారని తెలిపారు.
ఇక ఐటమ్ సాంగ్ లో నటించిన సమంతపై రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ… సమంత గురించి ఏం చెప్పమంటారు.ఈ పాటలో సమంత హాట్ నెస్ నెక్స్ట్ లెవెల్ అంటూ.పుష్ప ఐటమ్ సాంగ్ పై కామెంట్ చేశారు.ఈ విధంగా రకుల్ ప్రీత్ సింగ్ పుష్ప చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
ఇకపోతే అల్లు అర్జున్ రకుల్ ప్రీత్ సింగ్ బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.