యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగడమే కాకుండా RRR సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా మరింత గుర్తింపు సంపాదించుకున్నారు.ఇలా పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఒక అద్భుతమైన నటుడు అనే ఈ విషయం మనందరికీ తెలిసిందే.
కానీ మనకు తెలియని మరొక కోణం కూడా ఎన్టీఆర్ లో దాగి ఉందని తాజాగా ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.తాజాగా ఎన్టీఆర్ గల్ఫ్ మీడియాకు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో భాగంగా తన వ్యక్తిత్వం గురించి, తన తల్లి వ్యక్తిత్వం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.చిన్నప్పుడు మా అమ్మ నన్ను క్లాసికల్ డాన్స్ నేర్చుకోమని చెప్పారు.అమ్మ కోరిక మేరకు కూచిపూడి నాట్యం నేర్చుకున్నానని ఎన్టీఆర్ వెల్లడించారు.అదేవిధంగా మా అమ్మ క్రీడలలో నన్ను ప్రోత్సహించింది.
నేను నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అయ్యాను.కానీ ఎవరూ ఊహించని విధంగా నేను చివరికి నటుడిని అయ్యాను అంటూ ఎన్టీఆర్ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా వెల్లడించారు.

ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్టీఆర్ తన తల్లి పట్ల ఉన్న ప్రేమను తెలుపుతూనే నేషనల్ లెవెల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ అనే విషయాన్ని కూడా బయటపెట్టారు.ఈ విధంగా ఎన్టీఆర్ బాడ్మింటన్ ప్లేయర్ అని తెలియడంతో ఎన్టీఆర్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ తారక్ మల్టీ టాలెంటెడ్ అంటూ తమ అభిమాన నటుడి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.కొందరు ఎన్టీఆర్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా అంటూ కామెంట్ చేస్తున్నారు.