బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్7( Bigg Boss 7 ) గత సీజన్లకు భిన్నంగా సాగుతోందనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ షో సీజన్7 లో ఎన్నో ప్రత్యేకతలు ఉండగా ఉల్టా ఫుల్టా అంటూ పదేపదే చెబుతున్న నాగ్ ఈ సీజన్ ను గత సీజన్లతో పోల్చి చూస్తే భిన్నంగా నడిపిస్తున్నాయి.
ఈ షోలో హట్ టాపిక్ గా నిలిచిన కంటెస్టెంట్లలో రతికా రోజ్( Rathika Rose ) ఒకరు.పటాస్ ప్రియగా పాపులర్ అయిన ఈ కంటెస్టెంట్ రతికగా తన పేరును మార్చుకున్నారు.
రతికా రోజ్ తెలుగులో పలు సినిమాలలో నటించగా ఆ సినిమాలేవీ రతికకు చెప్పుకోదగ్గ స్థాయిలో గుర్తింపును తీసుకురాలేదు.ఈ కంటెస్టెంట్ బిగ్ బాస్ షో విన్నర్లలో ఒకరి మాజీ లవర్ అని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.పటాస్ షో( Patas Show )లో స్టాండప్ కమెడియన్ గా చేసిన రతిక ఇన్ స్టాగ్రామ్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు.
రతికా రోజ్ కు ఇన్ స్టాగ్రామ్ లో లక్షన్నరకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న రతికా రోజ్ నేను స్టూడెంట్ సార్ సినిమా( Nenu Student Sir )లో పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటించి మెప్పించారు.బిగ్ బాస్ షో తన జాతకాన్ని మారుస్తుందని ఆమె భావిస్తున్నారు.
ఏపీలో పుట్టి పెరిగిన రతిక బీటెక్ చదివారు.ఆర్థికంగా స్థిరపడ్డ కుటుంబానికి చెందిన రతిక బొమ్మ అదిరింది దిమ్మతిరిగింది సినిమాలో హీరోయిన్ గా చేశారు.
ఈ వారం నామినేషన్స్( Bigg Boss 7 Nominations ) లో ఉన్న రతిక సులువుగానే సేఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.టాలెంట్ కు తగిన స్థాయిలో సక్సెస్ దక్కలేదని భావిస్తున్న రతిక రాబోయే రోజుల్లో తన టాలెంట్ తో ఏ స్థాయికి ఎదుగుతారో చూడాల్సి ఉంది.స్టార్ హీరోల సినిమాలలో ఛాన్స్ వస్తే రతిక కెరీర్ మరో లెవెల్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది.