టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం నంబర్ వన్ కొరియోగ్రాఫర్ ఎవరనే ప్రశ్నకు ఎక్కువమంది శేఖర్ మాస్టర్ పేరును సమాధానంగా చెబుతారు.తెలుగులో దాదాపుగా అందరు హీరోల సినిమాలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పని చేశారు.
ఒక ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని తెలిపారు.నా పెళ్లి పెద్దలు కుదిర్చిన పెళ్లి అని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.
నేను చాలా మంచోడినని శేఖర్ మాస్టర్ వెల్లడించారు.నా భార్య హౌస్ వైఫ్ అని నా భార్యకు డ్యాన్స్ గురించి ఎక్కువగా తెలియదని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
నా భార్యతో మొదట కళ్యాణరాముడు మూవీ చూశానని ఆయన తెలిపారు.డ్యాన్స్ ఇష్టం లేకపోయినా నా భార్యకు నేనంటే చాలా ఇష్టమని అయితే ఆ విషయాలను ఆమె ఎక్స్ ప్రెస్ చేయదని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.
నా భార్య పేరు శిరీష అని శేఖర్ మాస్టర్ అన్నారు.
ఫ్రీ టైమ్ దొరికితే కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తానని శేఖర్ మాస్టర్ అన్నారు.
ఒక్కొక్క హీరోకు ఒక్కో బాడీ లాంగ్వేజ్ ఉంటుందని ఆయన తెలిపారు.జూనియర్ ఎన్టీఆర్ సూపర్ ఫాస్ట్ డ్యాన్సర్ అని శేఖర్ మాస్టర్ అన్నారు.
నాకు బాగా నచ్చిన హీరో ప్రభుదేవా మాస్టర్ అని శేఖర్ మాస్టర్ తెలిపారు.నెక్స్ట్ సాంగ్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటానని శేఖర్ మాస్టర్ చెప్పుకొచ్చారు.
స్కూల్, కాలేజ్ ఫ్రెండ్స్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నానని శేఖర్ మాస్టర్ తెలిపారు.ఆరేళ్లు చాలా స్ట్రగుల్స్ అనుభవించానని ఆయన చెప్పుకొచ్చారు.నాకు బాధ అనిపించి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాలని అనుకున్నానని ఆ సమయంలో బన్నీ గారి నుంచి ఫోన్ కాల్ వచ్చిందని శేఖర్ మాస్టర్ కామెంట్లు చేశారు.ఆ హీరో కాల్ తో కొత్త ఎనర్జీ వచ్చిందని శేఖర్ మాస్టర్ పేర్కొన్నారు.