మనం ఏదైనా సాధించినప్పుడు ముందుగా కుటుంబ సభ్యులతోనే పంచుకుంటాం.అలాంటిది మనీ వ్యవహారమైతే ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరిస్తాం.
బయటవాళ్ళకి చెప్పకపోయినా, ఇంట్లోవాళ్ళకైతే ఖచ్చితంగా చెప్పి తీరుతాము.అలాంటిది అతగాడు లాటరీలో ఏకంగా రూ.248 కోట్లమేర సంపాదించాడు.అయినా తన ఇంట్లో వాళ్ళకి కనీసం ఒక్క ముక్కైనా చెప్పలేదు.
ఆఖరికి కట్టుకున్న భార్యకైనా చెప్పలేదు.అయితే ఇది మనదగ్గర కాదనుకోండి, ఒక చైనా లాటరీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, చైనాలోని గ్వాంగ్జి జువాంగ్ ప్రాంతానికి చెందిన లీ అనే వ్యక్తికి లాటరీ అంటే పిచ్చి.బేసిగ్గా దిగువ మధ్యతరగతికి చెందిన ఈ వ్యక్తి ఎప్పటికైనా లాటరీ గెలుస్తానని నమ్మకంతో ఉండేవాడట.
ఈ క్రమంలో 80 యువన్లు అంటే 11 డాలర్లతో తో 40 లాటరీ టిక్కెట్లను కొనుగోలు చేసాడట.కాగా తాజాగా ఇందులో ఓ టిక్కెట్‌కు అక్షరాలా 30 మిలియన్ డాలర్లు అంటే మన రూపాయలలో సుమారు రూ.248 కోట్లు గెలుచుకున్నాడు.అయితే ఈ సంతోషకరమైన వార్తను మాత్రం కుటుంబసభ్యులకు కాదుకదా కనీసం భార్యకు కూడా ఆయన చెప్పకపోవడం కొసమెరుపు.
అయితే దానికి కారణం ఏమిటని అతనిని ప్రశ్నించగా ఈ డబ్బు వల్ల తమ కుటుంబం అహంకారులు, సోమరులుగా మారకూడదనే ఉద్దేశంతోనే చెప్పలేదని పేర్కొన్నాడు.ఇకపోతే లీ 6.85 లక్షల డాలర్లును సమాజ సేవ కోసం విరాళంగా ఇస్తానని, మిగిలిన నగదును వ్యక్తిగత అవసరాలకోసం, బిడ్డల చదువుకోసం, వ్యాపారకకోసం వినియోగిస్తానని చెప్పుకొచ్చాడు.ఇకపోతే అక్టోబర్ 24న అందుకున్న అతడు.
తన గుర్తింపును గోప్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ఓ కార్టూన్ వేషంలో వెళ్లడం గమనార్హం.