సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు చూస్తే మనం ఎంతో ఎమోషనల్ అవుతుంటాం.ప్రేమ, అనురాగం, అప్యాయతలతో మనసును కదలింపజేస్తాయి.
ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలా రేర్‌గా దర్శణం ఇస్తుంటాయి.సేమ్ ఇలాంటి వీడియోనే ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో చక్కర్లు కొడుతోంది.
ఈ వీడియోలో ఓ పెద్ద ఏనుగు తన మావటితో కలిసి ఫోన్‌లో వీడియో చూసేందుకు తెగ ప్రయత్నం చేస్తోంది.చిన్న పిల్లాడు ఫోన్ కావాలని తండ్రిని ఎలా మారం చేస్తాడో అలానే చేస్తోంది.
దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.
కేరళ ఎలిఫెంట్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు.
తమిళనాడులోకి కుంభకోణం కుంభేశ్వరర్ ఆలయం లోపల మావటి కూర్చొని ఉన్నాడు.అతను తన ఫోన్‌లో ఏదో వీడియోను చూస్తూ ఉన్నాడు.
అది గమనించిన ఏనుగు తన దగ్గరికి వచ్చి.‘నాకు వీడియో చూపించు.
నేను చూస్తా.’ అంటూ వీడియో చూసేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.నెటిజన్ల దృష్టిని ఆ ఏనుగు ఎంతగానో ఆకర్షిస్తోంది.
చూడటానికి ఎంతో ముచ్చటేస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.చిన్న పిల్లాడిలా మారం చేస్తున్న పెద్ద ఏనుగంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
మావటి-ఏనుగు మధ్య ఉన్న ప్రేమ, స్నేహబంధం వర్ణించడం కష్టమని పేర్కొంటున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన ఈ వీడియోకి క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు.‘ఏనుగు-మావటి మధ్య బంధం ఎంతో ప్రత్యేకమైనది.ఇది ప్రేమ, స్నేహం, గౌరవంతో కూడుకున్న అనుబంధం.
కుంభకోణం కుంభేశ్వరర్ ఆలయంలోని ఏనుగు తన సంరక్షకుడితో ఫోన్‌లో చూస్తుండంటే వీరిమధ్య ఎంత గాఢమైన బంధం ఉందో అర్థం చేసుకోవాలి.’ అని పేర్కొన్నారు.40 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకు 2 లక్షలకు పైగా వ్యూవ్స్ వచ్చాయి.38కే వరకు లైక్స్ వచ్చాయి.ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌గా నిలుస్తోంది.