కరోనా నేపథ్యంలో కొంత మంది ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు.దాదాపు చాలా మంది పరిస్థితి అంతే.
మరికొంత మంది బిజినెస్‌లు కూడా మూసివేయాల్సిన దుస్థితి ఏర్పడింది.అయితే, కొన్ని సంస్థలు లాక్‌డౌన్ తర్వాత కూడా ఉద్యోగుల్లో మార్పులు చేపట్లాలని భారీ ప్రక్షాళనలు చేపట్టింది.
ఈ జాబితాలో ప్రస్తుతం ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా చేరింది.ఆ వివరాలు తెలుసుకుందాం.
పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్స్ (పీఐపీ) అమెజాన్ ఉద్యోగులకు కొత్త టెన్షన్ మొదలైంది.ఒకవేళ వారి పేరు ఈ పీఐపీ జాబితాలో ఉంటే వాళ్లు కచ్చితంగా వేరే జాబ్ వెతుక్కోవాల్సిందేనట.
ఈ విషయంలో అమెజాన్ ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా ఉందట.అమెజాన్ ‘ఫోకస్’ పెర్ఫామెన్స్‌లో భాగంగా మెనేజర్ సదరు ఉద్యోగిని మానిటర్ చేస్తున్నట్టు ఎటువంటి వార్నింగ్ ఇవ్వడు.
దీన్ని సీటల్ టైమ్స్ పత్రిక ధ్రువీకరించింది.ఎందుకంటే ఈ పరీక్షలో అమెజాన్ ఎటువంటి వార్నింగ్ ఇవ్వకుండా ఉద్యోగి పెర్ఫామెన్స్‌ను మానిటర్ చేస్తారు.
ఈ ప్రక్రియంతా జరిగినపుడు కనీసం ఆ ఉద్యోగి పీఐపీ జాబితాలో ఉన్నట్లు కూడా తెలీదు.
అంత జాగ్రత్తగా చేస్తారు.
ఆ ఉద్యోగి పీఐపీ జాబితాలో ఉన్నట్లు అధికారికంగా తెలిసేలోగా అమెజాన్‌లో సదరు ఉద్యోగి జాబ్ అప్పటికే పోయినట్లు.అమెజాన్ ఈ నయా పాలసీ ప్రకారం కేవలం అమెజాన్ మెనేజర్‌కు అడిగి తెలుసుకునే వరకు ఈ పీఐపీ ‘ఫోకస్’లో సదరు ఉద్యోగి ఉన్నట్లు తెలియకూడదు.

ఈ ప్రక్రియను అమెజాన్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్యావేక్షిస్తుంది.ఒకవేళ ఉద్యోగి ఫోకస్ జాబితాలో ఉంటే జాబ్‌లో నుంచి తీసివేయడానికి ఒత్తిడి కూడా చేయవచ్చు.తన లక్ష్యంలో భాగంగా అమెజాన్ ప్రతిఏడు దాదాపు 6 శాతం తమ సిబ్బందిని తొలగిస్తుందని అమెజాన్ హ్యూమన్ రిసోర్స్ డాక్యుమెంట్స్ నివేదికల ద్వారా తెలుస్తోంది.ఈ సంస్థకు మొత్తానికి 1/3 వంతు తక్కువ ప్రతిభ కలిగిన ఉద్యోగులను తమకు తెలియకుండానే ఫోకస్ టూల్‌లో భాగంగా వారిని కంపెనీ నుంచి తొలగించడమే ప్రధాన లక్ష్యం.

కొంత మంది ఉద్యోగులకైతే వారు ఇతర ప్రాంతాలకు ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నాక.వారిని ఈ జాబితాలో చేర్చినట్లు కూడా వారికి తెలియదు.వారి అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేవలం పెర్ఫామెన్స్‌ని బేస్ చేసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేస్తున్నట్లు తెలిసింది.దీంతో సదరు ఉద్యోగులు బాధపడినా ప్రయోజనం లేదు.
విషయం తెలుసుకున్నాక కొందరి పరిస్థితి మరీ ఎమోష్‌నల్‌గా ఉంటుందట.