ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమైంది.ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు లావదేవీలకు సైతం ఇది ముడిపడి ఉంటుంది.
ముఖ్యంగా ఇది భారత్‌లో ఓ గుర్తింపు కార్డు.అయితే, ఆధార్‌లో చిన్నపాటి మార్పులు చేసుకోవడానికి గంటల తరబడి ఈసేవా సెంటర్ల వద్ద వేచి ఉండకుండా కొన్ని ఆన్‌లైన్‌లోనే మార్పులు చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఆధార్ కార్డు అప్డేట్ లింక్‌తో సులభంగా పుట్టిన సంవత్సరం, లింగం, అడ్రస్ మార్చుకోవచ్చు.ఆ వివరాలు తెలుసుకుందాం.
ఇక మీ ఆధార్ కార్డులో ఏవైన కీలక మార్పులు చేసుకోవాలంటే ఆధార్ సెంటర్లకు వెళ్లాల్సిన పనిలేదు.అక్కడ గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం అస్సలు లేదు.
కేవలం ఒక లింక్‌తో మీకు కావాల్సిన మార్పులు చేసుకోవచ్చు.యూనిక్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ఓ లింక్‌ను అందరికీ అందుబాటులు ఉంచింది.
దీంతో ఆధార్ కార్డుపై ఉన్న అడ్రస్, పుట్టిన సంవత్సరం, లింగం ఇతర వివరాలను మార్పులు చేసుకునే సౌలభ్యం కల్పించింది.
అదేhttps://ssup.uidai.gov.in/ssup/ లింక్.
కానీ, ఈ లింక్ ద్వారా ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలనుకునే వారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.ముఖ్యంగా ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మీ రిజిస్టర్డ్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది.ప్రతి అప్డేట్ పొందడానికి రూ.50 చొప్పున యూఐడీఏఐ స్వయం సేవల పోర్టల్ వసూలు చేస్తుంది.కేవలం ఒక్క అప్డేట్ ఒక్కసారి మాత్రమే చేయాలి.ఒకేసారి రెండు మూడు మార్పులు చేయడానికి వీలుండదు.మీ ఒరిజినల్ ఆధార్ కార్డు లేదా ఇతర ఐడెంటిఫికేషన్ కాపీని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.కేవలం కొన్ని చిన్న మార్పులు మాత్రమే ఆధార్ కార్డులో మార్చుకోవడానికి వీలు కల్పించారు.
పేరు, పుట్టిన సంవత్సరం, అడ్రస్‌లో మార్పులు చేయాలనుకుంటే.సంబంధిత డాక్యుమెంట్లను కూడా స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందికానీ, లింగంలో మార్పులకు ఎటువంటి కాపీ అవసరం ఉండదు.

ఈ మార్పుల్లో పెళ్లి తర్వాత పేరు మార్పు, స్పెల్లింగ్ కరెక్షన్, సీక్వెన్స్ మార్పు, చిన్న నుంచి ఫుల్ ఫాంలో మార్పులు చేసుకోవచ్చు.దీనికి మీ ఆధార్ కార్డు తప్పకుండా రిజిస్టర్డ్ మొబైల్‌కు లింక్ అయి ఉండాలి.లేకపోతే అప్డేట్ చేసుకోలేరు.యూఐడీఏఐ సెల్ఫ్ సర్వీస్ అప్డేట్ పోర్టల్ మాత్రమే వ్యక్తుల చిరునామా, లింగం ఇతర మార్పులకు సాయపడుతుంది.కానీ, జనాభా వివరాలు, బయోమెట్రిక్స్ (వేలిముద్ర, ఐరీష్, ఫోటోగ్రాఫ్) వంటి ఇతర వివరాల కోసం కచ్చితంగా ఆధార్ నమోదు కేంద్రాన్ని సందర్శించాల్సిందేనని యూడీఏఐ పేర్కొంది.