విండోస్‌ 11ను ఇలా సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోండి!

మైక్రోసాఫ్ట్‌ వినియోగదారులకు విండోస్‌ 11ను సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు కల్పించింది.ఇక విండోస్‌ 11 బీటా వెర్షన్‌ను ఏ పర్సనల్‌ కంప్యూటర్లో అయినా సులభంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

 Windows 11 Can Be Downloaded Easily In Any Pc, Ios Operating System, Microsoft,-TeluguStop.com

ఆ వివరాలు తెలుసుకుందాం.విండోస్‌ 10 ఆపరేటింగ్‌ సిస్టంను అధికారిక ఐఓఎస్‌ ఫైల్‌ ద్వారా అప్డేట్‌ చేసుకోవచ్చు.

విండోస్‌ వినియోగదారులు కొత్త వెర్షన్‌ను ఐఓఎస్‌ ద్వారా పొందాలనుకునేవారు ముందుగా మైక్రోసాఫ్ట్‌ వెబ్‌సైట్‌ ఆధారంగా సైన్‌ అప్‌ కావాలి.ఖాతా లింక్‌ అయిన తర్వాత విండోస్‌ ఇన్‌సైడర్‌ ప్రివ్యూ డౌన్‌లోడ్‌ పేజీ ఓపెన్‌ అవుతుంది.

డెవలప్మెంట్‌ చానల్‌ లేదా చానల్‌ బిల్డ్‌లో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.డెవలప్మెంట్‌ చానల్‌ ద్వారా త్వరగా అప్డేట్‌ అవుతుంది.

బీటా చానల్‌ ద్వారా స్టేబుల్‌గా ఉన్నా.అది కొత్త ఫీచర్లను పొందలేరు.

ప్రస్తుతం ఐఎస్‌ఓ ఫైల్‌ విండోస్‌ 11 ఇన్‌సైడర్‌ ప్రీవ్యూ బిల్డ్‌ 22000.160 డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.ఏదైనా అనుకూలించే పీసీలో విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టంను క్లీన్‌ ఇన్‌స్టాల్‌ చేయడానికి ఈ ఫైళ్లను ఉపయోగించవచ్చు.ఒకవేళ మీరు ఐఎస్‌ఓను ఉపయోగించి విండోస్‌ 11ను యాక్టివేట్‌ చేయడానికి వీలు కల్పించే విండోస్‌ 10 లైసెన్స్‌ తప్పకుండా అవసరమని గమనించాలి.

ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసిన అనంతరం, ఆ ఫైల్‌పై డబుల్‌ క్లిక్‌ చేసి ఓపెన్‌ చేయవచ్చు.మీ పర్సనల్‌ కంప్యూటర్‌ను విండోస్‌ 11కి అప్డేట్‌ చేయవచ్చు.11 వెర్షన్‌ను పీసీని అప్డేట్‌ చేయడానికి లేదా క్లీన్‌ చేయడానికి ఐఎస్‌ఓ ఫైల్‌ను ఉపయోగిస్తే, ఆపరేటింగ్‌ సిస్టంకు సంబం«ధించిన విండోస్‌ 11 ఫీచర్‌లను అందిస్తుంది.కొన్ని ఫీచర్లను కొత్తగా రీడిజైన్‌ చేసిన మైక్రోసాఫ్ట్‌ టీమ్స్, టాస్క్‌బార్, స్టార్ట్‌ మెనూ, కొత్త చాట్‌ యాప్‌ ఇంటిగ్రేషన్‌ అందుబాటులో ఉన్నాయి.

Telugu Ios System, Microsoft, Windows, Windowsinsider-Latest News - Telugu

విండోస్‌ 10 నుంచి అప్డేట్‌ చేసే వినియోగదారులు మల్టీ టాస్క్‌ కోసం మరికొన్ని మార్గాలను పొందుతారు.విండోస్‌ ఇన్‌సైడర్‌ డెవలప్మెంట్‌ చానల్‌ను ఎంచుకుంటే మరిన్ని మార్గాలు ఉంటాయి.టైమర్‌లను ఉపయోగించి పనిపై దృష్టి సారించే ఫోకస్‌ సెషన్స్‌ ఫీచర్‌తో కూడిన కొత్త అలారంతోపాటు కొత్త యాప్‌ అప్డేట్‌లను కూడా పొందుతారు.మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 11ను సంబంధించిన కొత్త పెయింట్‌ యాప్‌ టీజర్‌ను కూడా విడుదల చేసింది.

ఇది త్వరలో విండోస్‌ ఇన్‌సైడర్‌లకు దారితీస్తుంది.ఈ ఐఎస్‌ఓ ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేసి, కొత్త ఆపరేటింగ్‌ సిస్టంను ఇన్‌స్టాల్‌ చేయడం వల్ల వినియోగదారులు కొత్త ఫీచర్లకు యాక్సెస్‌ లభిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube