బంగ్లా ను ఓడించిన పాక్ సెమీస్ చేరుతుందా..ఏ జట్లకు అవకాశం ఉందంటే..?

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్( ODI World Cup ) లో సగానికి పైగా మ్యాచ్లు పూర్తయ్యాయి.ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లన్ని సెమీస్ బెర్త్ కోసమే.

 Will Pakistan Reach The Semis After Defeating Bangladesh Which Teams Have A Chan-TeluguStop.com

అందుకే ప్రతి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ముందుకు సాగుతోంది.భారత్ మినహా సెమీస్ చేరే మిగతా జట్ల ఫలితాలు ప్రతిరోజు తారుమారు అవుతున్నాయి.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ భారత్-పాకిస్థాన్( India-Pakistan ) మధ్య జరిగితే క్రికెట్ ఫ్యాన్స్ కు ఇక పండుగే.అయితే భారత్ దూకుడు చూస్తుంటే దాదాపుగా సెమీఫైనల్ కాదు ఫైనల్ చేరినట్టే.

మరి పాకిస్తాన్ జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం మూడు మ్యాచ్లలో గెలిచి ఆరు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది.పాకిస్తాన్ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉంది.

ఆ మ్యాచ్లో గెలిస్తే పాకిస్తాన్ పది పాయింట్లతో ఉంటుంది.అయినా కూడా పాకిస్తాన్ సెమీస్ చేరే అవకాశాలు లేవు.

Telugu Bangladesh, England, Zealand, Odi Cup, Pakistan-Sports News క్రీ�

మరి పాకిస్తాన్ సెమీస్ చేరాలంటే.న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ( New Zealand, England )జట్లపై పాక్ గెలవాలి.అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా లేదా సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడాల్సి ఉంటుంది.శ్రీలంక, సౌత్ ఆఫ్రికా చేతుల్లో న్యూజిలాండ్ ఓడాల్సి ఉంటుంది.శ్రీలంక, నెదర్లాండ్స్ జట్లను భారత్ ఓడించాల్సి ఉంటుంది.ఇలా జరగడం ఒకరకంగా అసాధ్యం అనే చెప్పాలి.

కాబట్టి పాకిస్తాన్ జట్టు సెమీస్ అవకాశాలు దాదాపుగా గల్లంతే అని చెప్పవచ్చు.పాకిస్తాన్ జట్టు ఆడిన ఏడు మ్యాచ్లలో కనీసం ఐదు మ్యాచ్లు గెలిచి ఉంటే అవకాశాలు ఉండేవి.

ఈ టోర్నీలో పాల్గొన్న జట్లలో ఏ జట్లకు సెమీఫైనల్ చేరే అవకాశం ఎంత మేరకు ఉందో చూద్దాం.

Telugu Bangladesh, England, Zealand, Odi Cup, Pakistan-Sports News క్రీ�

భారత జట్టు ఆడిన ఆరు మ్యాచ్లలో విజయం సాధించి మొదటి స్థానంలో ఉంది.ఈ జట్టుకు సెమీస్ అవకాశం 99.9%.సౌత్ ఆఫ్రికా జట్టు ఆరు మ్యాచ్లలో ఐదు గెలిచి రెండవ స్థానంలో ఉంది.ఈ జట్టుకు సెమీస్ అవకాశం 95%.న్యూజిలాండ్ 6 మ్యాచ్ లలో 4 గెలిచింది.ఈ జట్టుకు సెమీస్ అవకాశం 75%.ఆస్ట్రేలియా ఆరు మ్యాచ్లలో నాలుగు గెలిచింది.ఈ జట్టుకు సెమీస్ అవకాశం 74%.పాయింట్ల పట్టికలో తర్వాత స్థానంలో పాకిస్తాన్ ఉంది.కానీ ఆరవ స్థానంలో ఉండే ఆఫ్ఘనిస్తాన్ కు సెమీస్ చేరెందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి.

ఈ జట్టుకు సెమీస్ అవకాశం 31%.ఇక పాకిస్తాన్ కు 13%, శ్రీలంక 6%, నెదర్లాండ్స్ 5.8%, ఇంగ్లాండ్ 0.3%, బంగ్లాదేశ్ 0% సెమీస్ చేరే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube