పెళ్లి తర్వాత వరుణ్ తో కాకుండా కేవలం ఆ హీరోతోనే నటిస్తాను అంటూ లావణ్య త్రిపాఠి షాకింగ్ కామెంట్స్!

వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఇద్దరూ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.ఇటలీలో వేద మంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది.

 Will Act Only With That Hero After Marriage With Varun Tej Lavanya Tripathi Shoc-TeluguStop.com

ఇరు కుటుంబాల సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) మెడలో మూడు ముళ్లు వేశాడు వరుణ్ తేజ్.( Varun Tej ) పెళ్లి తర్వాత కొత్త జంట అందరికీ నమస్కారం చేస్తున్న ఫొటోను నాగ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అందరూ కొత్త జంటను ఆశీర్వదించాలని కోరారు.వీటితో పాటు పెళ్లి మండపంలో పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇవి చూసి ఫ్యాన్స్.కొత్త జంటకు బెస్ట్ విషెష్ చెబుతున్నారు.

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పరిచయం మొదలయ్యింది వారిద్దరూ కలిసి నటించిన మిస్టర్ చిత్రంతో. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమకు దారితీసింది.

అప్పటి నుంచి వీళ్ళ ప్రేమ విషయాన్ని చాలా జాగ్రత్తగా దాచుకుంటూ.బయటకు రానీయకుండా జాగ్రత్త పడ్డారు.

అయితే రెండేళ్ల క్రితం వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక( Niharika ) పెళ్లిలో లావణ్య త్రిపాఠి తెగ సందడిగా ఉండడంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని అందరికీ అర్థం అయిపోయింది.ఇక ఆ పెళ్లి తర్వాత నుంచే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం బయటకు వచ్చి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అయింది.

ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ లావణ్య వరుణ్ తేజ్ తో ఏడడుగులు వేసింది.

Telugu Lavanyatripathi, Nagababu, Sai Dharam Tej, Varun Tej-Movie

ఇక అసలు ఈ విషయాన్ని అంతా పక్కన పెట్టి మన టాపిక్ విషయం గురించి చర్చిస్తే.లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ కంటే ముందే గతంలో ఓ హీరోతో ఎఫైర్ నడిపిందని ఆయన మరెవరో కాదు.మెగా కుటుంబానికి( Mega Family ) చెందిన ఓ హీరోనే పుకార్లు షికారు చేస్తున్నారు.

మరింతకు మెగా హీరో( Mega Hero ) ఎవరు అనుకుంటున్నారు? ఆయన మరెవరో కాదు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.( Sai Dharam Tej ) వీరిద్దరు కలిసి నటించిన చిత్రం ఇంటలిజెంట్.

ఇక ఈ చిత్రం విడుదలైంది 2018లో కాగా ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత సాయి ధరమ్ తేజ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది లావణ్య త్రిపాఠి.

Telugu Lavanyatripathi, Nagababu, Sai Dharam Tej, Varun Tej-Movie

మీకు క్లోజ్ ఫ్రెండ్స్ లో బెస్ట్ హస్బెండ్ గా ఎవరని ఓ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అడగగా.వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా సాయి ధరమ్ తేజ్ పేరు చెప్పింది.సాయి ధరమ్ తేజ్ బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ అని కితాబిచ్చింది.

వరుణ్ తేజ్ చాలా మంచి వాడని మాత్రమే చెప్పుకొచ్చింది.నా కెరియర్లో సాయి ధరమ్ తేజ్ లాంటి బెస్ట్ పర్సన్ ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదని ఆకాశానికెత్తేసింది.

ఇక అప్పట్లో వీళ్ళిద్దరి మధ్యల ఏదో గుసగుసలు సాగుతున్నాయని ఓ రేంజ్ లో వార్తలు వైరల్ గా వ్యాపించినప్పటికీ ప్రస్తుతం మాత్రం లావణ్య వరుణ్ తో పెళ్లి చేసుకుని వాటికి స్వస్తి పలికింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube