నిన్న ప్రకటించిన జాతీయ అవార్డుల జాబితా విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా సంతృప్తిగా ఉన్నారు.గతంలో ఎప్పుడు లేని విధంగా అద్భుతమైన ప్రదర్శన తెలుగు సినిమా కనబర్చిన నేపథ్యం లో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారు.
ఈ సమయంలోనే కొందరు విమర్శలు కూడా చేస్తున్నారు.ఆర్‌ఆర్ఆర్ సినిమా లోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు దక్కింది.
కానీ ఆస్కార్ దక్కించుకున్న నాటు నాటుకు జాతీయ అవార్డు ల జాబితాలో చోటు దక్కలేదు.కీరవాణి( M.M.Keeravani )కి ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి గాను ఆస్కార్ అవార్డు దక్కింది.ఉత్తమ కొరియోగ్రఫీ అందించినందుకు గాను నాటు నాటు పాటకు గాను ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కు జాతీయ అవార్డు లభించింది.కానీ నాటు నాటు పాటకు గాను ఉత్తమ సంగీత దర్శకుడు అవార్డును కీరవాణి సొంతం చేసుకోలేక పోయాడు.

ఆస్కార్ వారిని మెప్పించిన నాటు నాటు మన జాతీయ సినీ అవార్డు జ్యూరీ మెంబర్స్ ను మెప్పించలేక పోయిందా అని కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు.పుష్ప సినిమా లోని పాటలకు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డును దేవి శ్రీ ప్రసాద్( Devi Sri Prasad ) కు దక్కింది.మన తెలుగు వాడికే ఆ జాతీయ అవార్డు వచ్చింది కనుక పెద్దగా చర్చ అక్కర్లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కీరవాణికి మరియు దేవి శ్రీ ప్రసాద్ కి జాతీయ అవార్డు రావడం చాలా గొప్ప విషయం.ఆర్‌ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట( Naatu Naatu Song )కి కూడా జాతీయ అవార్డు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది అనేది కొందరి అభిప్రాయం.అంతే తప్ప ఇక్కడ విమర్శలు చేయడానికి ఏమీ లేదు.
మొత్తనికి తెలుగు సినిమా స్థాయి సత్తా కలెక్షన్స్ లోనే కాకుండా జాతీయ అవార్డుల్లో కూడా చూపించడం ఈసారి ప్రత్యేకత.దేశ వ్యాప్తంగా తెలుగు సినిమాకు ఉన్న ఆధరణకు ఇది ప్రత్యక్ష సాక్ష్యం.
ముందు ముందు తెలుగు సినిమా గొప్ప విజయాలను దక్కించుకోవాలని కోరుకుందాం.