జనసేనతో ఇలా ప్లాన్ చేస్తున్న బీజేపీ ? వర్కవుట్ అయ్యేనా ? 

ఏపీలో ఎన్నికల సమయం ముంచుకు వస్తోంది.ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి.

 Is Bjp Planning This With Janasena? Do You Work Out, Janasena, Bjp, Tdp, Chandra-TeluguStop.com

వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు, ప్రజలు మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.అధికార పార్టీ వైసిపి ఒంటరిగా ఎన్నికలకు వెళ్తున్నట్లుగా ఎప్పుడో ప్రకటించింది .ఇక బిజెపి, ( BJP party ) జనసేన పార్టీలు ఎప్పుడో పొత్తు పెట్టుకున్నాయి.ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ప్రకటనలు చేస్తుండగా, టిడిపి కూడా ఈ రెండు పార్టీలతో జత కలిసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

అయితే బిజెపి ,జనసేన ( Janasena )అధికారికంగా పొత్తు పెట్టుకున్నా , ఏ విషయంలోనూ రెండు పార్టీలు కలిసి వెళ్లకపోవడం, ఉమ్మడి కార్యచరణలతో ముందుకు వెళ్లకపోవడంతో , రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతుందా లేదా అనేది అందరికీ అనుమానంగా మారింది.ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు వ్యవహరించిన సోము వీర్రాజు జనసేన విషయంలో అంత పట్టించుకోనట్టుగా వ్యవహరించడం, ఏ విషయంలోనూ సంప్రదింపులు చేయకపోవడంతో, జనసేన ఏపీలో బిజెపికి దూరంగా ఉన్నట్లుగానే వ్యవహరించింది.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Purandareswari, Ysrcp-Poli

 అయితే ఇటీవల ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి ( Daggupati purndareswari )జనసేన విషయంలో క్లారిటీకి వచ్చారు .ఆ పార్టీని కలుపుకుని జనాల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.అయితే రెండు పార్టీలు విడివిడిగా బలపడాల్సిన పరిస్థితి ఉండడంతో , అంశాల వారీగా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని,  ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.ఇకపై జనసేనతో కలిసి ఉద్యమాలు చేయాలని విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో పార్టీ క్యాడర్ కు పురందరేశ్వరి పిలుపునిచ్చారు.

  బిజెపి , జనసేన కలిసి ఉద్యమాలు చేసేలా ముందు ముందు అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన నిధులను ఏపీ ప్రభుత్వం పక్కదారి పట్టించింది అంటూ బిజెపి అనేక ఆరోపణలు చేస్తోంది.

Telugu Ap Cm Jagan, Ap, Chandrababu, Jagan, Janasena, Purandareswari, Ysrcp-Poli

సర్పంచ్ సంఘాల నేతలు పురందరేశ్వరుని కలిసి ఇదే విషయంపై ఫిర్యాదు చేయడం, పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు సైతం ఈ విషయాలను చెప్పుకోవడంతో వీరి సమస్యపై బీజేపీ ,జనసేనలు కలిసి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి ప్రజా సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకున్నారు.ఈ విషయంలో జనసేన పార్టీనీ కలుపుకుని వెళ్లే విధంగా పురందేశ్వరి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా , బీజేపీతో కలిసి వెళ్లే విషయంలో రెండు పార్టీల అగ్ర నేతలు మధ్య సఖ్యత ఉన్నా ,కిందిస్థాయి కేడర్ లో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.

జనసేన, బీజేపీ క్యాడర్ భిన్న ధృవాలు అన్నట్టుగా వ్యవహరించిన ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి రాకుండా అటు పురందరేశ్వరి, ఇటు పవన్ కళ్యాణ్ ప్రత్యేక తీసుకుంటేనే ఈ రెండు పార్టీల మధ్య ఉన్న పొత్తుకు న్యాయం జరిగినట్లు అవుతుంది అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube