ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు తమ సినిమా జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్నికి అస్సలు లింకు చేయరు.నిజానికి వ్యక్తిగత జీవితం ఒకటైతే సినిమా జీవితం మరొకటి.
ఒకేసారి ఈ రెండు జీవితాలలో బాధ్యత వహిస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తుంటారు.కాబట్టి సినిమాలలో ఉన్న పాత్ర నిజజీవితంలో ఉండదని నటీనటులు చాలాసార్లు తెలుపుకుంటూ ఉంటారు.
కానీ కొందరు మాత్రం అటు రీల్, ఇటు రియల్ లైఫ్ లో ఒకేలా ఉంటారు.ఇదిలా ఉంటే ఇటువంటి ఉద్దేశంలోనే నమిత కొన్ని కామెంట్స్ చేసింది.
ఇంతకు ఆ కామెంట్స్ ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన గుజరాతి బ్యూటీ నమిత గురించి అందరికీ పరిచయమే.
తన అందంతో, నటనతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.కానీ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమయింది.
కెరీర్ మొదట్లో మిస్ ఇండియాగా నాల్గవ స్థానంలో నిలిచింది.దాంతో అక్కడి నుంచే సినిమాల్లోకి అడుగు పెట్టింది.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో కూడా నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
టాలీవుడ్ ఇండస్ట్రీకి తొలిసారిగా స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన జెమిని సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టింది.
ఈ సినిమాలో ఎంతో అందంగా కనిపించడమే కాకుండా తన తొలిసారి నటనతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ తర్వాత సొంతం సినిమాలో నటించి మంచి గుర్తింపు అందుకుంది.అలా పలు సినిమాలలో నటించగా ప్రభాస్ నటించిన బిల్లా సినిమాతో మాత్రం అందరికీ షాక్ ఇచ్చింది.

అందులో తన ఎద అందాలతో హాట్ హాట్ లుక్ లతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల దృష్టిని తన వైపుకు లాక్కుంది.ఒకప్పుడు సన్నగా, నాజుగ్గా ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు బాగా లావు అవ్వడమే కాకుండా తన లుక్ ను కూడా పూర్తిగా మార్చేసింది.అలా బరువు పెరగటంతో అవకాశాలు కూడా తన దరికి రాలేదనే చెప్పాలి.
ఇక పెళ్లి తర్వాత సినిమాలకే దూరమైంది నమిత.

ఇదిలా ఉంటే తనను ఎవరూ అసహ్యించుకోవద్దు అని ఓ కామెంట్ చేసింది.ఎప్పుడు హీరోయిన్ పాత్రల్లోనే కాకుండా గతంలో విలన్ పాత్రలో కూడా నటించింది నమిత.అది కూడా తమిళంలో విడుదలైన ఇలైంజ్ఞన్ అనే సినిమాలో విలన్ పాత్రలో నటించింది.
ఇక ఈ పాత్ర గురించి గతంలో తాను కొన్ని విషయాలు పంచుకుంది.ఈ పాత్ర తనకు బాగా సెట్ అవుతుందని కాబట్టి మీరే చేయాలని డైరెక్టర్ అన్నప్పుడు లైట్ తీసుకున్నానని తెలిపింది.

అయితే ఆ పాత్ర గురించి మొత్తం విన్న తర్వాత ఆ పాత్రలో తాను నటిస్తేనే బాగుంటుంది అని అనుకుందట.ఇక ఈ సినిమా చూసిన తర్వాత అందరికీ తన పై కోపం వస్తుందని.కారణం ఆ పాత్రలో అంత ఇంపాక్ట్ ఉందని తెలిపింది.అందుకు ఈ పాత్రలో తనను చూసి ఎవరు వ్యక్తిగతంగా అసహ్యించుకోవద్దని కోరింది.దీంతో కొందరు తనను అర్థం చేసుకొని అది కేవలం నటన కాబట్టి మీరు నటించారు అని ఇందులో ఎటువంటి తప్పు లేదని ధైర్యం ఇచ్చారు.