ఎక్కడైనా ఓకే ప్రొఫెషన్ లో పనిచేసే అమ్మాయి అబ్బాయి ఎక్కువగా ప్రేమలో పడుతుంటారు.ఆ విషయానికి వస్తే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ల పక్కన హీరోయిన్ గా చేసిన వాళ్లని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వాళ్లతో పాటు నటించి ఒకరికొకరు బాగా అర్థం చేసుకొని ముందు ఫ్రెండ్స్ గా వాళ్ళ పరిచయం స్టార్ట్ అయి ఆ తర్వాత ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు.అలాంటి వాళ్ళలో నాగార్జున అమల, రాజశేఖర్ జీవిత, సూర్య జ్యోతిక లాంటి వాళ్లను మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు అయితే సినిమాల్లోనే కాకుండా ఈమధ్య వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లో చేసే వాళ్లు కూడా ప్రేమలో పడుతున్నారు వాళ్లలో షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైనా లు ఉన్నారు.
షణ్ముఖ్ జస్వంత్, వైవా అనే షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ఒక మంచి గుర్తింపు సాధించాడు.ప్రస్తుతం షణ్ముఖ్ జస్వంత్ ఈమధ్య సాఫ్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సిరీస్ తో మంచి గుర్తింపు సాధించాడు.
జశ్వంత్ కి సోషల్ మీడియాలో ఎంత గుర్తింపు ఉందంటే ఇప్పటివరకు జశ్వంత్ 3 కోట్ల మంది ఫాలోవర్స్ ని కలిగి ఉన్నారు.అలాగే దీప్తి సునైనా కూడా బిగ్ బాస్2 లో పాటిస్పేట్ చేసి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
అలాగే షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైన ఇద్దరు చాలా కవర్ సాంగ్స్ లో నటించి జనాలు అందరికీ చేత శభాష్ అనిపించుకున్నారు స్క్రీన్ పైన వీళ్ళ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది.అయితే వీళ్లు చేసే షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా లవ్ చేసుకుంటున్నారు అనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి అయితే ఎప్పటికప్పుడు వీళ్లిద్దరూ ఆ వార్తలను ఖండించినప్పటికీ వాళ్లు ప్రవర్తించే తీరు చూస్తుంటే నిజంగానే ఇప్పటికీ ప్రేమలోనే ఉన్నారు అని చెప్పొచ్చు అయితే అప్పట్లో ఇద్దరు ఒకే రకమైన లవ్ టాటూస్ వేయించుకున్నారు.
జనాలు మాత్రం వీళ్లిద్దరు కొన్ని రోజులు ప్రేమించుకుని ఆ తర్వాత విడిపోయారు అని అనుకున్నారు కానీ ఈమధ్య జస్వంత్ సోషల్ మీడియా లైవ్ లో ఉన్నప్పుడు తన అభిమాని అయిన ఒకరు దీప్తి సునైనా మీరు విడిపోయారా అని అడిగితే చేతి మీద టాటూ చూపిస్తూ ఇది ఉన్నంతకాలం తనని నేను ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పడంతో జశ్వంత్ ఫ్యాన్స్ తో సహా నెటిజన్లలందరూ వీళ్లు విడిపోలేదు.వీళ్లు ఇంకా లవ్ చేసుకుంటున్నారు తొందర్లోనే పెళ్లిపీటలు కూడా ఎక్కపోతున్నారు అని అనుకుంటున్నారు.
అలాగే మా టీవీ వారు కండక్ట్ చేస్తున్న 100% లవ్ ప్రోగ్రాం లో సినిమా లో నటించి లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ ని గాని, సీరియల్స్ లో నటించి లవ్ మ్యారేజ్ చేసుకున్న కపుల్స్ ని గాని, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ ద్వారా లవ్ లో ఉన్న కపుల్స్ ని గాని ఈ షోలో కి పిలుస్తున్నారు అలాగే జశ్వంత్ దీప్తి సునైనా వాళ్లని కూడా పిలిచారు.

దీంట్లో భాగంగా దీప్తి సునైనా నువ్వు ఇచ్చిన గిఫ్ట్ లే నామీద నీకున్న ప్రేమ ని మర్చిపోకుండా చేస్తున్నాయి అనే డైలాగ్ చెప్పడంతో జనాలు వీళ్ళు ప్రేమించుకునే మాట 100% నిజమే తొందర్లోనే వీళ్ళ పెళ్లి విషయం కూడా అఫీషియల్ గా చెప్పబోతున్నారు అని అనుకుంటున్నారు.షణ్ముఖ్ దీప్తి సునైనా ఎన్నిసార్లు వాళ్ళ ప్రేమ మేటర్ వచ్చినప్పుడు తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా కూడా ఎప్పటికప్పుడు జనాలకి ఏదో ఒక మేటర్ ద్వారా వాళ్ళ ప్రేమ విషయం తెలుస్తూనే వస్తుంది.అయితే జనాలు మాత్రం వాళ్లు చెప్పినంత మాత్రాన వాళ్ల ప్రేమ విషయం మనకు తెలియకుండా దాగుతుందా ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాం ముందు ప్రేమించుకుంటారు ఆ తర్వాత జనాలకి చెప్పడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మొత్తానికి ఏదో ఒక రోజు పెళ్లి విషయం చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ ని జనాలని ఆశ్చర్యానికి గురి చేస్తారు అని జనాలు వాళ్లకి వాళ్లు ఇలా అనుకుంటున్నారు.
చూద్దాం మరి వీళ్ళ ప్రేమ పెళ్లి దాకా వెళుతుందో లేదో.