దగ్గుబాటి హీరోలకు ఏమైంది.. ? ఆ సినిమాల సంగతి ఏంటి ?

తండ్రి బాటలో పయణిస్తూ.ఆయన స్థాపించిన సంస్థను సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి దగ్గుబాటి సురేష్.

 What Happened To Daggubati Heros And Their Movies ,tollywood, Suresh Productions-TeluguStop.com

తన తండ్రి నాటిన సురేష్ ప్రొడక్షన్స్ అనే మొక్కను మహా వ్రుక్షంగా మార్చడంలో ఆయన శ్రమ ఎంతో ఉందని చెప్పుకోవచ్చు.ప్రస్తుతం టాలీవుడ్ టాప్ నిర్మాతగా కొనసాగుతున్న ఆయన.చిత్రాలను నిర్మించడంతో పాటు ఆ సినిమాలను అద్భుతంగా మార్కెట్ చేసుకోవడంలోనూ ఆయనకు ఆయనే సాటి అని చెప్పుకోవచ్చు.సినిమా కథల ఎంపిక నుంచి.

బడ్జెట్ కేటాయింపు, నటీనటుల సెలక్షన్ వరకు అన్నీ ఆయనే తగ్గరుండి చూసుకుంటాడు.అటు సినిమా రెడీ అయిన తర్వాత కూడా తన దగ్గరి మనుషులకు చూపించి.

ఏవైనా మార్పులు చేర్పులు చెప్తే వాటిని సరిచేసి అంతా ఓకే అనుకుంటేనే రిలీజ్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.థియేటర్స్ తో పాటు డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో టాప్ గా ఉన్న ఆయన.తన సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ చేయాలి అనుకోవడం పలు విమర్శలకు తావిస్తుంది.

కరోనా రెండో దశకు ముందే సురేష్ ప్రొడక్షన్స్ కు సంబంధించి మూడు సినిమాలు విడుదలకు సిద్ధం అయ్యాయి.

వెంకటేష్ హీరోగా నారప్ప, దృశ్యం-2, రానా హీరోగా విరాటపర్వం సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి.అయితే ప్రస్తుతం కరోనా పూర్తిగా కంట్రోల్లోకి రాకపోవడం మూలంగా ఈ సినిమాలకు ఓటీటీలకు అమ్మినట్లు ప్రచారం జరుగుతుంది.

తొలుత ఈ వార్తలను ఖండించారు.ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ వేదికగా నారప్ప విడుదల అయ్యింది.థియేటర్ల ఓనర్లే ఇలా ఓటీటీలకు అమ్ముకోవడం ఏంటనే విమర్శలు వచ్చాయి.దృశ్యం-2, విరాటపర్వం సినిమాలు కూడా ఇతర నిర్మాతలతో కలిసి తీశాడు సురేష్ బాబు.వీటిని కూడా ఓటీటీ వేదికగానే విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి.

Telugu Daggubati, Drushyam, Maestro, Ppa, Rana, Suresh Babu, Suresh, Tollywood,

టక్ జగదీష్, మాస్ట్రో సినిమాలను ఇప్పటికే ఓటీటీలకు అమ్మేశారు.అయితే థియేటర్ల ఓనర్ గా ఉన్న సురేష్ బాబు కూడా ఓటీటీని తన సినిమాలకు వేదికగా మార్చుకోవడం పట్ల పలువురు సినిమా థియేటర్ల ఓనర్లు గుర్రుగా ఉన్నారు.సురేష్ బాబు లాంటి వ్యక్తులే థియేటర్ల గురించి పట్టించుకోకపోతే.

వాటి మనుగడ కష్టం అనే అభిప్రాయంలో ఉన్నారు.ఇంతకీ సురేష్ బాబు ఈ రెండు సినిమాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube