బాహుబలి వల్ల నాకు ఒరిగింది ఏమి లేదు : జాన్ కొక్కెన్

బాహుబలి.టాలీవుడ్ దర్శకుడి చేతిలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది.

 John Kokken Revealed About Bahubali Movie , John Kokken, Rajamouli, Bahubali, Sa-TeluguStop.com

భారత్ లో గతంలో చూడిని రేంజిలో విజువల్ వండర్ గా ఈ సినిమా తెరకెక్కింది.ఈ ఒక్క సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియన్ హీరోగా మారిపోయాడు.

దర్శకుడు రాజమౌళికి అయితే హాలీవుడ్ రేంజ్ గుర్తింపు వచ్చింది.ఈ సినిమాలో నటించిన రమ్యక్రిష్ణ, నాజర్, సత్యరాజ్.

తమ అద్భుత నటనతో అదుర్స్ అనిపించారు.అంతేకాదు.

ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ సినిమాతో తర్వాత వరుస ఆఫర్లు దక్కించుకున్నారు.

అయితే ఈ సినిమా మూలంగా కొందరు మంచి పేరు తెచ్చుకుంటే.కొందరు పేరున్న నటులకు కూడా ఈ సినిమా ద్వారా అసలు గుర్తింపు దక్కకపోవడం బాధాకరం.

బాహుబలిలో జాన్ కొక్కెన్ నటించినా ఆయనకు పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు.తాజాగా ఆయన నటిస్తున్న సార్పట్ట మూవీలో ఓ కీరోల్ పోషించాడు.తెలుగు, తమిళ సినిమా పరిశ్రమల్లో ఆయనకు మంచి గుర్తింపు దక్కింది.వేటపులి పాత్రలో ఎంతో ఆకట్టుకున్నాడు.

తాజాగా ఆయనకు రెండు పరిశ్రమల నుంచి మంచి అవకాశాలు వస్తున్నాయి.తాజాగా సోషల్ మీడియాలో జాన్ కాలకేయ గెటప్ లో ఉన్న ఫోటోను ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు.

నిజానికి ఆయన బాహుబలి సినిమాలో నటించాడు అనే విషయమే చాలా మందికి తెలియదు.కాలకేయ అనగానే ప్రభాకర్ మాత్రమే గుర్తుకు వస్తాడు.

మిగతా వారికి అంతగా గుర్తింపు రాలేదు.కారణం అంతా ఒకే గెటప్ లో మేకప్ వేసుకోవడం.

Telugu Bahubali, John Kokken, Johnkokken, Rajamouli, Sarpatta, Tamil, Telugu, To

తాజాగా ఆయన నటించిన సార్పట్ట మూవీతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు.అటు సోషల్ మీడియా ద్వారా తన బాహుబలి గుర్తులను తవ్వితీసిన నెటిజన్లకు ధన్యవాదాలు చెప్తున్నాడు.ఇప్పటికే ఎవడు, నేనొక్కడినే సినిమాల్లో నటించాడు జాన్.కేజీఎఫ్ లో ఉన్నా కూడా ఆయనకు అంతగా పేరు రాలేదు.రంజిత్ పా తాజా సినిమాతో ఆయనకు ఓ రేంజిలో గుర్తింపు దక్కింది.ఈ సందర్భంగా దర్శకుడికి ధన్యవాదాలు చెప్పాడు జాన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube