ఆసియాలోనే ఆ ఒక్క రికార్డ్ ఇళయరాజా సొంతం

ఇళయరాజా.భారతీయ సంగీత ప్రపంచంలో ఓ అత్యున్నత శిఖరం.

 Unbelievable Asian Record Of Master Ilayaraajaa , Ilayaraja, Asian Music Lovers,-TeluguStop.com

ఎవరికీ సాధ్యంకాని రీతిలో కీబోర్డుపై అద్భుతాలు క్రియేట్ చేశాడు ఈ మ్యూజిక్ మ్యాస్ట్రో.ఎన్నో సినిమాలకు అద్భుత సంగీతాన్ని అందించిన ఇళయరాజా మరే సంగీత దర్శకుడికి అందనంత ఎత్తుకు ఎదిగిపోయాడు.

ఇళయరాజా సుమారు 45 ఏండ్ల క్రితం తమిళనాడులోని ఓ మారుమూల గ్రామం నుంచి మ్యూజిక్ నేర్చుకోవడానికి మద్రాసులో అడుగు పెట్టాడు.తొలి రోజుల్లో చేతిలో డబ్బులు లేక.చాలా ఇబ్బందులు పడ్డాడు తను.అయినా సంగీతం నేర్చుకోవాలి అనే సంకల్పం ముందు తనకు అవన్నీ చిన్నవిగానే అనిపించాయి.పట్టువిడవకుండా సంగీతాన్ని నేర్చుకున్నాడు.నెమ్మదిగా సంగీత దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.కొత్త కొత్త ట్యూన్స్ క్రియేట్ చేస్తూ మిగతా సంగీత దర్శకులకు భిన్నంగా ముందుకు కదిలాడు ఇళయరాజా.శాస్త్రీయ సంగీతంపై ఆయనకు ఎంతో మమకారం ఉంది.

అందుకే కర్నాటక సంగీతంతో పాటు తమిళ, సంస్కృత భాషల్లో 7 కృతులను కంపోజ్ చేశాడు.

ఇళయరాజా కెరీర్ లో 1993, జూలై 19 ఓ మర్చిపోలేని రోజు.

ఆసియా సంగీత ప్రియులు గర్వంతో తలెత్తుకున్న రోజు.ఆ రోజు రాణి ఎలిజబెత్.

ఆధ్వర్యంలోని సుప్రసిద్ధ రాయల్ ఫిల్హార్‌మోనిక్ ఆర్కెస్ట్రా కు చెందిన వరల్డ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జాన్ స్కాట్ పర్యవేక్షణలో ఇళ‌య‌రాజా రూపొందించిన సింఫ‌నీ మ్యూజిక్ ను రికార్డు చేశారు.ఆ ఆల్బ‌మ్‌ను పిర‌మిడ్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసింది.

ప్ర‌పంచ సంగీత ప్రముఖులతో పాశ్చాత్య-శాస్త్రీయ సంగీత కలబోతగా సింఫ‌నీని రూపొందించిన తొలి ఆసియా మ్యూజిక్ ఆర్టిస్టుగా ఇళయరాజా ఘనత సాధించాడు.

Telugu Ilayaraja, John Scott, Queen Elizabeth, Symphony Music-Latest News - Telu

ఆసియాలోనే తొలిసారి సింఫ‌నీ రూపొందించిన ఫస్ట్ పర్సన్ గా ఇళయరాజా గౌరవం దక్కించుకున్నారు.అయితే కొందరు అసూయాపరులు ఆయనపై లేనిపోని విమర్శలు చేశారు.ఈ విమర్శలను ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌, భాగ్య‌రాజా, పి.వాసు, పంజు అరుణాచ‌లం సహా పలువురు ప్రముఖులు తిప్పికొట్టారు.ఆయన విజయం ఎంతగొప్పదో వివరించారు.

ఆయనలాంటి వారిపై విమర్శలు సిగ్గుచేటు అంటూ మండిపడ్డారు.ఆయనకు ఘన సత్కారం చేసి అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube