కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?

విదేశాల్లో సమయం గడుపుతున్న వారు ఇంటికి తిరిగి రావాలని చాలా కోరుకుంటారు తమ ఫ్యామిలీతో సమయం గడపాలని ఆశిస్తారు.అయితే ఇటీవల 24 ఏళ్ల భారతీయ మహిళ మన్‌ప్రీత్ కౌర్ ( Manpreet Kaur )కూడా ఇంటికి బయలుదేరింది.

 The Nri Woman Who Left For Her Country With Crores Of Hopes Is A Tragedy Inside,-TeluguStop.com

నాలుగు సంవత్సరాల తర్వాత మొదటిసారిగా తన కుటుంబాన్ని కలవడానికి ఆమె స్వస్థలానికి పయనమయ్యింది.అయితే ఇంటికి చేరుకోక ముందే ఆమె ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఢిల్లీ మీదుగా పంజాబ్‌కు తిరిగి వెళ్లే అంతర్జాతీయ క్వాంటాస్( Qantas International ) విమానంలో ఆమె ప్రయాణం మొదలెట్టింది.విమానంలోకి ఎక్కిన కొద్దిసేపటికే మరణించింది.నాలుగేళ్లుగా తల్లిదండ్రులను కలుసుకోవాలని, వారితో హాయిగా సమయం గడపాలని నిర్ణయంతో ఆశపడింది.అంతలోనే అంతులేని విషాదం వారి జీవితాల్లోకి ప్రవేశించింది.

ఆస్ట్రేలియా మీడియా కథనాల ప్రకారం, ఆమె సీట్‌బెల్ట్‌ను పెట్టుకునే సమయంలో ఒక్కసారిగా సీట్లో నుంచి పైకి ఎగిరి కింద కుప్పకూలిపోయింది.

Telugu Australia, Indian Origin, Manpreet Kaur, Melbourne, Nri-Telugu NRI

ఆమె స్నేహితులు ప్రకారం మన్‌ప్రీత్ విమానాశ్రయానికి చేరుకునే కొన్ని గంటల ముందు అస్వస్థతకు గురైంది.విమానంలోకి ఎక్కగలిగింది, కానీ సీట్‌బెల్ట్‌ను బిగించుకుంటున్నప్పుడు ఫ్లోర్‌పై పడి మరణించింది అని తెలిపారు.మన్‌ప్రీత్ కౌర్ విమానం ఇంకా మెల్బోర్న్ విమానాశ్రయంలోని( Melbourne Airport ) బోర్డింగ్ గేట్‌తో కనెక్ట్ అయి ఉండటం వల్ల, క్యాబిన్ సిబ్బంది, అత్యవసర సేవలు ఆమెకు చేరుకోగలిగాయి, కానీ ఆమెను కాపాడలేకపోయారు.

Telugu Australia, Indian Origin, Manpreet Kaur, Melbourne, Nri-Telugu NRI

మన్‌ప్రీత్ క్షయవ్యాధితో( tuberculosis ) బాధపడుతోంది, ఇది ఊపిరితిత్తులను ఎక్కువగా ప్రభావితం చేసే ఒక అంటువ్యాధి, వ్యాధి వల్ల వచ్చిన సమస్య కారణంగా ఆమె మరణించి ఉండవచ్చని భావిస్తున్నారు.ఆమె చెఫ్ కావాలని ఒక కోర్సు చేస్తుంది.అంతే కాదు ఆస్ట్రేలియా పోస్ట్‌లో పనిచేస్తోంది.“ఆమె విమానంలోకి ఎక్కినప్పుడు, సీట్‌బెల్ట్‌ను బిగించుకోవడానికి కష్టపడింది.విమానం బయలుదేరడానికి కొద్దిసేపు ముందు, ఆమె తన సీటు ముందు పడిపోయి మృతి చెందింది,” అని ఆమె స్నేహితుడు గుర్దీప్ గ్రేవాల్ తెలిపారు.మన్‌ప్రీత్ మొదటిసారిగా 2020, మార్చిలో ఆస్ట్రేలియాకు వెళ్లిందని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube