మంత్రివర్గంలో వీరికే ఛాన్స్ .. క్లారిటీ ఇచ్చేసిన దామోదర 

గత కొద్ది రోజులుగా తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ పై వార్తలు వస్తూనే ఉన్నాయి.పూర్తిస్థాయిలో మంత్రి వర్గాన్ని విస్తరించేందుకు అధిష్టానం సూచనలతో రేవంత్ రెడ్డి( Revanth Reddy ) నిర్ణయం తీసుకోబోతున్నారు.

 Damodara Gave Them A Chance In The Cabinet, Telangana Congress, Congress, Revant-TeluguStop.com

మొదటి నుంచి పార్టీలో ఉన్నవారితో పాటు, ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారికి మంత్రి పదవులు వరించబోతున్నాయనే విషయాన్ని బయటపెట్టారు.  వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ( Damodara Rajanarsimha )త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని , కొంతమంది మంత్రుల శాఖలు కూడా మారుతాయి అని ఆయన క్లారిటీ ఇచ్చారు.

మంత్రివర్గ విస్తరణలో ముగ్గురు లేదా నలుగురిని తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు.ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా పేరుపొందిన ములుగు ఎమ్మెల్యే మంత్రి సీతక్కకు హోం మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా కాంగ్రెస్ లో ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం హోం శాఖ రేవంత్ రెడ్డి వద్ద ఉంది.

Telugu Congress, Damodaragave, Komatireddy, Damodararaja, Revanth Reddy, Sithakk

మంత్రివర్గ విస్తరణలో సీతక్కకు( Sitakka ) కేటాయించే అవకాశం కనిపిస్తోంది.  అలాగే నల్గొండ నుంచి కాంగ్రెస్ కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి( Komati Reddy Rajagopal Reddy ) మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందట .అలాగే హైదరాబాద్ నుంచి దానం నాగేందర్ పేరు వినిపిస్తోంది.బిఆర్ఎస్ లో ఎమ్మెల్యేగా గెలిచి దానం నాగేందర్ కాంగ్రెస్ లో చేరారు.గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని  మంత్రి పదవి విషయంలో దానం నాగేందర్ పేరు పరిగణలోకి తీసుకున్నారట.

అలాగే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas Reddy )పేరు వినిపిస్తోంది.అలాగే జగిత్యాల ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ బి ఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు.

ఆయన చేరికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారు.  దీంతో ఆయనను బుజ్జగించేందుకు మంత్రి శ్రీధర్ బాబు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంప్రదింపులు చేశారు.

Telugu Congress, Damodaragave, Komatireddy, Damodararaja, Revanth Reddy, Sithakk

అధిష్టానం పెద్దలు సైతం జోక్యం  చేసుకోవడంతో ఆయన అలక వీడారు.ఈ నేపథ్యంలో ఆయన పేరు కూడా మంత్రివర్గంలో వినిపిస్తోంది.అయితే ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి చేరిన వారికి ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవులు ఇచ్చేది లేదని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ క్లారిటీ ఇచ్చారు.అయితే ఇప్పుడు పరిస్థితుల ప్రభావంతో అటువంటి వారికి మంత్రి పదవులను కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube