ప్రస్తుత వర్షాకాలంలో( rainy season ) పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో జలుబు అనేది ముందు వరుసలో ఉంటుంది.ఇంట్లో ఒకరికి జలుబు చేసిందంటే మిగతా వారికి కూడా సులభంగా వ్యాప్తి చెందుతుంది.
అలాగే జలుబు( cold ) చిన్న సమస్యే అయినప్పటికీ తీవ్రమైన అసౌకర్యానికి గురి చేస్తుంది.జలుబు వల్ల సరిగ్గా శ్వాస అందక నానా తిప్పలు పడుతుంటారు.
అయితే జలుబు వచ్చాక బాధపడడం కన్నా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే హెర్బల్ టీ( Herbal tea ) చాలా బాగా సహాయపడుతుంది.
వర్షాకాలంలో జలుబుకు దూరంగా ఉండాలి అనుకునే వారు వారానికి కనీసం రెండు సార్లు అయినా ఈ హెర్బల్ టీని తాగాల్సిందే.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హెర్బల్ టీ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.వాటర్ హీట్ అవ్వగానే పది ఫ్రెష్ పుదీనా ఆకులు( Mint leaves ), ఐదు తులసి ఆకులను లైట్ గా క్రష్ చేసి వేసుకోవాలి.
అలాగే రెండు దంచిన యాలకులు( Cardamom ) మరియు నాలుగు లవంగాలు కూడా వేసి వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి.
ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన హెర్బల్ టీ అనేది సిద్ధం అవుతుంది.వర్షాకాలంలో ఈ హెర్బల్ టీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.రోజు ఉదయం లేదా సాయంత్రం వేళ ఈ హెర్బల్ టీ ను తీసుకుంటే అందులో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.
ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని చేకూరుస్తుంది.సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలకు అడ్డుకట్ట వేస్తుంది.
అలాగే ఈ హెర్బల్ టీ ను తీసుకోవడం వల్ల బాడీ డిటాక్స్ అవుతుంది.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.ఇక చాలామంది చిన్న వయసులోనే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు.అయితే అలాంటి వారు నిత్యం ఈ హెర్బల్ టీ తాగితే మోకాళ్ళ నొప్పులకు బై బై చెప్పవచ్చు.