ఇంకొన్ని నెలలో ఏపీలో ఆర్ధిక పరిస్థితి దివాళా తీసే పరిస్థితికి రాబోతుంది సుస్థిర మైన ఆదయమార్గం లేదు అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్ళు అవుతుంది.ఒక్క అవకాశం ఇవ్వమని చెప్పి వచ్చారు.
వచ్చిన తరువాత అభివృద్ధి చేయలేకపోయారు మూడున్నర లక్షల కోట్లు అప్పులు చేశారు .అంతలా అప్పులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది సంక్షేమ పథకాలు కేవలం వైసీపీ వాళ్ళకే ఇస్తున్నారు ప్రైవేట్ రంగాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయలేకపోయారు ఎక్కడ నుండి అప్పు వస్తాది.ఏ ఆఫీసును తాకట్టు పెడదాం అన్న రకంగా ఆలోచిస్తున్నారు చిన్న చిన్న ఆస్తులు పోతే ప్రభుత్వ ఖజానా పోతుంది ప్రజలు మీద భారం వేస్తున్నారు.
ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయా అని ప్రశ్నిస్తున్నా? ప్రతి ఇంటి మీద రూ.10 వేలు అడుగుతున్నారు సవాలు మీద కూడా డబ్బులు వసూలు చేస్తారా?? టీడీపీని నిర్వీర్యం చేసే విదంగా ఆలోచన చేస్తున్నారు తప్పా అభివృద్ధి చేసే విధంగా చేయట్లేదు నిలకడలేని నిర్ణయాలతో కాలాన్ని, డబ్బును వృధా చేస్తున్నారు రాజధాని ఎక్కడ ఉందో మున్సిపల్ శాఖామంత్రి బొత్సా వచ్చి ఒక క్లారిటీ ఇవ్వాలని టీడీపీ తరపున డిమాండ్ చేస్తున్నాం ఈ రెండున్నర ఏళ్లలో నీచమైన పాలన అందించినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం