ఏపీతో పాటు ఆ రాష్ట్రాలలో వేడిగాలులు వాతావరణ శాఖ హెచ్చరిక..!!

దేశంలో ఎండాకాలం( Summer Season ) మొదలైపోయింది.ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

దీంతో ప్రభుత్వాలు హెచ్చరికలు చేస్తున్నాయి.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి నెలకొని ఉంది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్నారు.ఈ క్రమంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా( Odissa ), ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో వేడిగాలుల ప్రభావం అత్యధికంగా ఉంటాయని వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటన చేయడం జరిగింది.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రా( Andhra Pradesh )ష్ట్రంలో 10 నుంచి 20 రోజులు వేడిగాలుల ప్రభావం ఉంటుందని పేర్కొంది.

Advertisement

చాలా ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువగా వేడిగాలులు ఉండే అవకాశం ఉందని తెలిపింది.దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది.ఏప్రిల్ నెల మొదలవగానే ఇప్పటికే ఉష్ణోగ్రతలు( Temperatures ) పెరిగిపోతున్నాయి.

వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇంక రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఉదయం 11 గంటల తర్వాత రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.వారం రోజులుగా రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో రానున్న రోజులలో వాతావరణ శాఖ వేడి గాలుల ప్రభావం అత్యధికంగా ఉంటుందని ప్రకటన చేయటం సంచలనంగా మారింది.

బీఆర్ఎస్ కు మళ్లీ గుర్తుల టెన్షన్ !
Advertisement

తాజా వార్తలు