ఏపీలో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈ మేరకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 2,83,749 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ తెలిపింది.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3,83,396 మంది ఓటర్లుండగా కడప, అనంతపురం, కర్నూలు గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3,29,248 మంది ఓటర్లు ఉన్నారని ఈసీ పేర్కొంది.
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు టీచర్స్ నియోజకవర్గంలో 26,907 మంది ఓటర్లున్నారు.
కడప, అనంతపురం, కర్నూలు టీచర్స్ నియోజకవర్గంలో 27,774 మంది ఓటర్లున్నారని ఈసీ ప్రకటించింది.కాగా వచ్చే ఏడాది మార్చి 29న ఐదుగురు ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుంది.