టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ బుట్ట బొమ్మ పూజా హెగ్డే.ప్రస్తుతం ఓ రేంజ్ లో అవకాశాలు అందుకుంటున్నప్పటికి కూడా సక్సెస్ లు మాత్రం అందుకోవడం లేదు.
ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ అమ్మడు అవకాశాలు అందుకుంటుంది.కానీ ఎటువంటి ఫలితం లేకుండా పోతుంది.
తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి 2010లో అడుగు పెట్టిన పూజా హెగ్డే. 2014లో ముకుంద సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.ఈ సినిమాలో తన తొలి నటనతో మంచి పేరు సంపాదించుకుంది.ఆ తర్వాత ఒక లైలా కోసం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ కూడా నటించింది.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకొని మంచి స్టార్ హోదా ను సంపాదించుకుంది.
నిజానికి దర్శక నిర్మాతలు కూడా పూజా హెగ్డే కోసం ఎదురుచూస్తూ ఉంటారు.ఆమెను సెంటిమెంట్ గా భావిస్తారు.ఇక అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో సినిమాలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
ఈ సినిమాతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకొని బుట్ట బొమ్మగా నిలిచింది.
ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను బాగా పంచుకుంటుంది.తనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇక తన అభిమానులతో అప్పుడప్పుడు తెగ ముచ్చట్లు పెడుతూ ఉంటుంది.అంతేకాకుండా తెగ ఫోటో షూట్ లు చేయించుకుంటూ తన హాట్ లుక్ లతో కుర్రాళ్లను బాగా ఫిదా చేస్తుంది.
ఇక తాను వర్క్ అవుట్ లు చేసిన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా కొన్ని ఫోటో షూట్ లు చేయించుకుంది పూజ.ఇక ఆ ఫోటోలను పంచుకోగా ప్రస్తుతం అవి బాగా వైరల్ అవుతున్నాయి. అయితే అందులో ఆమె వేసుకునే డ్రెస్ అచ్చం డోర్ కర్టెన్ లాగా ఉండగా ఆమె డ్రెస్ ని చూసి నెటిజన్స్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు.
డోర్ కర్టన్ వేసుకున్నావు అంటూ ఇక ఏ డ్రెస్సులు దొరకలేవా అంటూ దారుణంగా కామెంట్లు పెడుతున్నారు.ప్రస్తుతం ఆ ఫోటో బాగా వైరల్ అవుతుంది.
ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే.ఈ మధ్య వరుస సినిమాలతో ఫ్లాప్ కావడంతో ఐరన్ లెగ్ అనే ట్యాగ్ సొంతం చేసుకుంది.మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఆచార్య, రాధేశ్యామ్ సినిమాలతో అస్సలు సక్సెస్ కాలేక పోయింది పూజా హెగ్డే. ఇటీవలె బాలీవుడ్ లో ఆమె నటించిన సర్కస్ మూవీ విడుదల కాగా ఆ సినిమా కూడా సక్సెస్ కాలేదు.
అయినప్పటికీ ఈమె ఖాతాలో మరో రెండు సినిమాలు ఉన్నట్లు తెలుస్తుంది.