బెంగుళూరు జట్టును చిత్తుగా ఓడించిన కోల్ కత్తా.. ఓటమిపై స్పందించిన విరాట్ కోహ్లీ..!

తాజాగా బెంగళూరు – కోల్ కత్తా( RCB vs KKR ) మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 21 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కత్తా ఐదు వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది.

 Virat Kohli Comments On Rcb Losing To Kkr In Ipl 2023 Details, Virat Kohli , Rcb-TeluguStop.com

తర్వాత లక్ష్య చేదనకు దిగిన బెంగళూరు జట్టు 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి ఓటమిని ఖాతాలో వేసుకుంది.ఈ మ్యాచ్ జరిగిన తీరు పై విరాట్ కోహ్లీ( Virat Kolhi ) స్పందిస్తూ.

ప్రొఫెషనల్ గా ఆడ లేక పోయామంటూ తెలుపుతూ, చేజేతుల మ్యాచ్ ఓడిపోయామని తెలిపాడు.

ఓ రకంగా బౌలింగ్ పర్వాలేదు కానీ ఫిల్డింగ్ లో మాత్రం దారుణంగా విఫలమయ్యామని తెలిపాడు.

కొన్ని క్యాచులు మిస్ అవ్వడంతో అనవసరంగా 20-30 పరుగులు అదనంగా సమర్పించుకోవాల్సి వచ్చిందని తెలిపాడు.ఇక తాము బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అనవసర షాట్లు కొట్టి నేరుగా ఫీల్డర్ చేతికి క్యాచ్లు ఇచ్చి వికెట్లు కోల్పోయామని తెలిపాడు.

మహిపాల్ తో( Mahipal ) తాను నిర్మించిన భాగస్వామ్యం మాదిరిగా మరొక భాగస్వామ్యం లభించి ఉంటే గెలిచే అవకాశం ఉండేదని తెలిపాడు.సొంత మైదానంలో ఓడిపోవడం చాలా బాధగా ఉందని తెలిపాడు.తర్వాత జరిగే మ్యాచ్లలో గెలవాల్సిన అవసరం ఉందని, లేదంటే జట్టు కు ఇబ్బందులు తప్పవని విరాట్ కోహ్లీ తెలిపాడు.

ఫాఫ్ డుప్లేసిస్, గ్లెన్ మ్యాక్స్ వెల్ లు విఫలం కావడం వల్లనే బెంగుళూరుకు విజయ అవకాశాలు తగ్గుతున్నాయి.ఈ ఇద్దరూ క్రీజులో ఉండి ఉంటే జట్టు గెలిచే అవకాశం ఉండేది.విరాట్ కోహ్లీ 54 పరుగులు, మహిపాల్ 34 పరుగులు చేసిన ఫలితం లేకుండా పోయింది.

ఇక దినేష్ కార్తీక్ కూడా కీలక సమయంలో పెవిలియన్ చేరాడు.దీన్నిబట్టి అర్థమైంది ఏమిటంటే ఫాఫ్ డప్లేసిస్, మ్యాక్స్ వెల్ సరిగ్గా ఆడకపోతే బెంగళూరు జట్టు గెలిచే అవకాశాలు చాలా తక్కువ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube