క్రూయిజ్‌షిప్ అనేది మహా సముద్రాలలో కదిలే ఒక సిటీ అని చెప్పవచ్చు.ఇందులో సినిమా థియేటర్ల నుంచి అమ్యూజ్‌మెంట్ పార్క్ వరకు అన్నీ ఉంటాయి.
ముఖ్యంగా సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉన్న క్రూయిజ్‌షిప్ రూఫ్ పై ఉండే జారుడు బల్లాలు, లూప్ స్లయిడ్స్ వంటివి పెద్దలు, చిన్న పిల్లలని ఒకేలా ఆకట్టుకుంటాయి.
అయితే తాజాగా ఓ క్రూయిజ్ షిప్‌లో ప్రయాణిస్తున్న ఒక యువతి అందులోని ఒక పారదర్శక వాటర్ స్లయిడ్‌లో జారడం ప్రారంభించింది.
కానీ ఆమె బయటకు రాకుండా మధ్యలోనే చిక్కుకుపోయింది.దీనికి సంబంధించిన భయానక వీడియో టిక్ టాక్ లో వైరల్‌గా మారింది.
దానిని YMG ట్రావెల్స్ అనే ఒక ఇన్ స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.ఈ ఘటన నార్వేజియన్ క్రూయిజ్ లైన్ లో చోటు చేసుకుంది.
వైరల్ అవుతున్న వీడియోలో, ఒక యువతి లూప్ లో జారుతూ పైకి వెళ్లడాన్ని చూడవచ్చు.కానీ రైడ్‌ను పూర్తి చేయడానికి తగినంత వేగం లేదు.
దాంతో ఆమె లూప్ పైనుంచి క్రిందకు జారి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది.
చివరికి ఆమె స్లయిడ్ గొట్టాలలో చిక్కుకుపోయింది.బాగా నునుపుగా ఉండే ఇందులో నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం.వేలాది మంది ప్రయాణించే ఇంత పెద్ద షిప్ లో లూపింగ్ స్లయిడ్ సరిగా ఉందో లేదో చెక్ చేయకపోవడం గమనార్హం.టిక్ టాక్ లో ఈ వీడియోను 14.5 మిలియన్లకు పైగా వీక్షించారు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు.వామ్మో అందులో చిక్కుకుంటే ఊపిరాడక చచ్చిపోతారని ఒక యూజర్ కామెంట్ చేశాడు.“ఈ వీడియో చూస్తుంటే నా హార్ట్ బీట్ పెరుగుతుంద”ని మరొక యూజర్ పేర్కొన్నాడు.“నేను క్లాస్ట్రోఫోబియాతో చనిపోతాను.” ఒక నెటిజన్ పేర్కొన్నారు.అదృష్టం కొద్దీ ఇందులో చిన్నపిల్లలు ఇరుక్కుపోలేదు లేదంటే వారు మరింత భయపడేవారు అని మరి కొందరు కామెంట్లు పెడుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.