వైరల్ వీడియో: కాంస్య పతకం సాధించిన హాకీ టీంకు స్వయంగా ఫోన్ చేసి మరి అభినందించిన ప్రధాని..!

ప్రపంచంలో ఒలింపిక్స్ గేమ్స్ అంటే విశిష్టమైన ప్రత్యేకత ఉంది.అటువంటి ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు పతకం సాధించింది.టీమిండియా పురుషుల హాకీ జట్టు విజయం పొందడం పట్ల ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.41 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్‌ లో భారత హాకీ పురుషుట జట్టు మెడల్ గెలుపొందడం పట్ల అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో భారత దేశ ప్రధాన మంత్రి మోదీ హాకీ టీమ్ ను అభినందించారు.ప్రధానే స్వయంగా హాకీ టీమ్ కెప్టెన్‌ మన్‌ ప్రీత్‌సింగ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశాడు.

 Viral Latest, Viral Video, Social Media, Sports Updates, Olympics , Hockey Team,-TeluguStop.com

ఆ టైంలో హాకీ జట్టు కోచ్ కూడా అక్కడే ఉండటంతో ఆయనతో కూడా ప్రధాని మోదీ మాట్లాడారు.ఈ సందర్భంగా ఇద్దర్నీ ప్రధాని వారిని ప్రశంసించాడు.మ్యాచ్ అయిపోయిన తర్వాత భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ మ‌న్‌ప్రీత్ సింగ్‌ కు ఫోన్ చేసి ప్రధాని మాట్లాడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

మోదీ మాట్లాడితన తర్వాత మ‌న్‌ ప్రీత్ సింగ్ కూడా ఆయనతో కొంత సేపు ముచ్చటించారు.ప్రధాని దీవెన‌లు హాకీ టీమ్ ను విజయం సాధించేలా చేశాయంటూ తెలిపారు.ఇప్పుడే కాదు కొన్ని రోజుల ముందు అంటే భారత పురుషుల హాకీ టీమ్ సెమీస్ లో వెళ్లినప్పుడు కూడా ప్రధాని మోదీ ఫోన్ చేసినట్లుగా తెలిపారు.

ఆ టైంలో మోదీ చెప్పిన మాటలు తమను మోటివేట్ చేశాయని తెలిపారు.టీమ్ సభ్యులు ఆటలో కనబరిచిన తీరు అందర్నీ ముగ్దులను చేసిందన్నారు.భారత పురుషుల హాకీ జట్టు విజయం సాధించడం పట్ల దేశ వ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది.పంజాబ్ సర్కార్ హాకీ పురుషుల జట్టుకు భారీ నజరానా ఇవ్వనున్నట్లు తెలిపింది.

కాంస్య మెడల్ సాధించిన జట్టుపై పంజాబ్ క్రీడాశాఖ మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధి నగదు బహుమతి ప్రకటించారు.ప్రతి పంజాబీ క్రీడాకారుడికి కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం టీమ్ ను మోదీ ఫోన్ అభినందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube