వైరల్ వీడియో: సయ్యాటలో ఉన్న పాములను విడదీసిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?!

పాము అనేది ఒక విష సర్పం అని తెలిసి చాలామంది దాన్ని చూసి భయపడతారు.పాములు జనాలు నివసించే ప్రాంతాల్లో సంచరించడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాము.

 The Person Who Separated The Snakes In Sayyata .. What Happened After That ..?!-TeluguStop.com

అయితే ఒకవేళ అలా పాములు జన సంచారం ఉండే ప్రాంతాల్లోకి వచ్చినప్పుడు పాములు పట్టే అతన్ని పిలిచి వాటిని పట్టించి అడవిలో వదిలేపిస్తారు.అయితే ఇద్దరు ఆకతాయి కుర్రాళ్ళు తమ కంటే తోపులు ఎవరు లేరని అతి ఉత్సాహంతో రెండు పాములు సయ్యాట ఆడుకునే సమయంలో ఆ పాములను విడకొట్టి, పట్టుకుని వాటితో ఆట ఆడడం మొదలుపెట్టారు.

కోపముతో రగిలిపోతున్న పాము ఒక ఆకతాయిని కాటేసింది.అసలు ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే కొమురంభీం జిల్లాలోని జైనూరు కేంద్రంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు ఒక రెండు పాములు సయ్యాటలు ఆడుకుంటూ వచ్చాయి.

ఆ పాములను చుసిన గ్రామస్థులు వాటిని పట్టుకునేందుకు సోనుపటేల్‌ గూడెంకి చెందిన కనక రాంజీ, కనక రాందాస్‌ అనే ఇద్దరు అన్నదమ్ములకు సమాచారం ఇచ్చి వాళ్ళని పిలిపించారు.వాళ్లిదరు కొంతసేపటికి అక్కడకు చేరుకొని ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్న జంట పాములను చూసి వాటిని చేతితో పట్టుకుని ప్రజలు నివసించే ప్రాంతానికి దూరంగా ఉండే అడవిలో వదిలిపెట్టేందుకు వెళ్లారు.

కానీ వాళ్లిద్దరూ ఏమనుకున్నారో ఏమో పాములు పట్టడంలో మనకంటే తోపులు ఇక్కడ ఎవరు లేరని ఊరందరికీ తెలియచేయాలి అని అనుకున్నారు.అనుకున్నదే తడువుగా పాములు భయంకర విష సర్పాలు అని తెలిసి కూడా ఆ ఇద్దరు అన్నదమ్ములు పట్టుకున్న రెండు పాములను చేత్తో పట్టుకుని ఊరంతా వాటిని చూపిస్తూ ఎంచక్కా బైక్ పై తిరుగుతున్నారు.

ఇంతలో వాళ్ళు పట్టుకున్న పాములలో ఒక పాముకు సయ్యాటలో తీవ్రగాయాలు అవ్వడంతో పాటు, కోపంతో రగిలిపోతూ.బుస్ బుస్ మంటూ బుసలు కొడుతూ అన్న దమ్ముల్లో ఒకడు అయిన కనక రాంజీ అనే యువకుడి ఎడమ చేతి బోటన వేలుపై కాటు వేసింది.కాటు వేసిన వెంటనే రాంజీ పాములను వదిలేసి అరవడం మొదలుపెట్టాడు.కనక రాందాస్‌ మాత్రం హమ్మయ్య అనుకుని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తన సోదరుడిని స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.

కానీ.అక్కడ పరిస్థితి అదుపుతప్పడంతో అతన్ని మంచి చికిత్స కోసం ఆదిలాబాద్‌ లోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు.

ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.గొప్పలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అంటే ఇదే కాబోలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube