సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు మాత్రమే కాదు ఉపయోగకరమైన వీడియోలు కూడా వైరల్ అవుతుంటాయి.ముఖ్యంగా ఎలక్ట్రిక్, వాటర్, మెకానికల్, కన్‌స్ట్రక్షన్‌కి సంబంధించిన వీడియోలు చాలామందిని ఆకట్టుకుంటుంటాయి.
తాజాగా పైపు రిపేరింగ్ ( Pipe Repairing )కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిని @HowThingsWorks_ ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.43 సెకన్ల నిడివిగల ఈ వీడియోకు ఇప్పటిదాకా 1 కోటి 12 లక్షల వ్యూస్ వచ్చాయి.
వీడియోలో భూమిలో పూడ్చిపెట్టిన ఒక పైపు పగలడం మనం చూడవచ్చు.అక్కడ నీళ్లు లీక్( Water leak ) అవుతున్నాయని తెలిసి చుట్టుపక్కల మొత్తం తవ్వి దానిని బాగు చేయడానికి సర్వీస్ మెన్ వచ్చారు.వారిలో ఒక వర్కర్ కిందకు దిగి పగిలిన పైపును ఫిక్స్ చేయడానికి ఏదో పరికరం పైపు చుట్టూ చుట్టడం మనం చూడవచ్చు.
పగిలినది ఒక పెద్ద పైపు.దానికి పడిన చిల్లు కూడా పెద్దదే.అందువల్ల నీరు పైకి ఎగిసిపడుతోంది.దీనిని బాగు చేయాలంటే చాలానే పని పడుతుంది.
అలాగే వాటర్ ఫ్లోను ఆపాల్సి ఉంటుంది.
.
అయితే ఈ శ్రమ, నీటి సరఫరాకి అంతరాయం ఏర్పడకుండా ఒక సరికొత్త పరికరాన్ని వర్కర్ ఉపయోగించాడు.అది కపులింగ్ లాగా కనిపించింది.దానిని పైప్ కి చుట్టేసి చిల్లు పడిన చోటుకు తీసుకొచ్చాడు.అనంతరం కపులింగ్‌కు ఉన్న నట్స్ బిగించడం స్టార్ట్ చేశాడు.
దానివల్ల అది పైపుకు గ్యాప్ లేకుండా అతుక్కుంది.కానీ చిల్లు పడిన చోట మాత్రం నీరు కారుతూనే ఉంది.
అయితే ఆ కప్లింగ్ కి ఒక ట్యాప్ లాగా ఉంది.ఆ ట్యాప్ ను అతడు మూసేయడంతో నీరు ఆగిపోయింది.
ఈ టెక్నిక్ చాలా అద్భుతంగా, శక్తివంతంగా కనిపించింది.దీనిని చూసి చాలామంది వావ్ అంటున్నారు.
ఇలాంటి టెక్నిక్ తాము కూడా ఉపయోగిస్తామని పేర్కొంటున్నారు.ఈ పరికరాలు పేర్లు తెలపాలని అడుగుతున్నారు.