ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అందరికీ చాలా ఆసక్తిని కనబరుస్తున్నాయి.అయితే మరొక మూడు రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో వచ్చే ఎన్నికలలో గెలుపు ఎవరిది అనే విషయంపై చర్చలు కూడా మొదలయ్యాయి.
అయితే తాజాగా వచ్చే ఎన్నికలలో ఎవరు విజయం సాధిస్తారు అని అంశం గురించి వేణు స్వామి( Venu Swamy ) చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనగా మారాయి వేణు స్వామి ఇప్పటివరకు సెలబ్రిటీల గురించి రాజకీయ నేతల గురించి చేసినటువంటి వ్యాఖ్యలు నిజమయ్యాయి అయితే తాజాగా ఈయన రాబోయే ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడారు.
2024వ సంవత్సరంలో కూడా కచ్చితంగా జగన్( Jagan ) ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు.ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పొత్తు పెట్టుకున్నప్పటికీ పొద్దు ప్రభావం విజయంపై ఏమాత్రం చూపదని తెలిపారు.పవన్ కళ్యాణ్-చంద్రబాబు( Chandra Babu ) జాతకాల రీత్యా పొత్తు వలన పెద్దగా ప్రయోజనం లేదని ఆయన అంటున్నారు.
వేణు స్వామి మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో మోసపోవడం ఖచ్చితమని తెలిపారు.గ్రహాల రీత్యా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లవి ప్రతికూల నక్షత్రాలు.చంద్రబాబుది పుష్యమి నక్షత్రం, పవన్ కళ్యాణ్ ది ఉత్తరాషాఢ నక్షత్రం.ఈ రెండు నక్షత్రాలకు అసలు పొసగదు.
ఇలా వీరిద్దరి జాతకాల రీత్యా పొంతన లేదు కనుక వీరు పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి వచ్చినా కూడా గెలుపు సాధ్యం కాదని తెలిపారు.అందుకే మరోసారి జగన్ అధికారంలోకి వస్తారని తెలిపారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ముఖ్యమంత్రి( Chief Minister ) కాలేరని వేణు స్వామి తెలిపారు.నేను పవన్ కళ్యాణ్ పై ద్వేషంతో ఇలా మాట్లాడటం లేదు ఆయన జాతకం ప్రకారం జాతకంలోనే సీఎం అయ్యే యోగ్యం లేదని తెలిపారు.
ఇలా పవన్ ముఖ్యమంత్రి కారు అని చెప్పిన వేణు స్వామి ఆయన పిఠాపురంలో ఈసారి గెలుస్తారా లేదా అన్నది మాత్రం వెల్లడించకపోవడం గమనార్హం.