ఒకప్పుడు పేపర్ బాయ్ గా( Paper Boy ) పని చేసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే( MLA ) కావడం అంటే సులువు కాదనే సంగతి తెలిసిందే.అయితే తెలంగాణ ఎన్నికల్లో ఈ అసాధ్యం సుసాధ్యం అయింది.
గోండు బిడ్డ వెడ్మ బొజ్జు( Vedma Bojju ) సక్సెస్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.రాజకీయాల్లో సామాన్యులు రాణించడం సులువు కాదనే అభిప్రాయాన్ని వెడ్మ బొజ్జు మార్చేశారు.
బీ.ఆర్.ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పై ఆయన పైచేయి సాధించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇంట్లో నివాసం ఉంటున్న వెడ్మ బొజ్జు అదే కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) నుంచి టికెట్ సాధించి ఔరా అనిపించడంతో పాటు ప్రశంసలు అందుకుంటున్నారు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్ మండలం కల్లూర్ గూడకు చెందిన నిరుపేద ఆదివాసీ దంపతులు వెడ్మ భీంరావు, గిరిజాబాయిల కొడుకు అయిన వెడ్మబొజ్జు పటేల్ పీజీ వరకు చదువుకున్నారు.
ఆదివాసీ విద్యార్థి సంఘంలో పని చేసిన వెడ్మ బొజ్జు తర్వాత రోజుల్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితిలో సలహాదారుడిగా పని చేయడంతో పాటు ఆ తర్వాత రోజుల్లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేశారు.రెండు సంవత్సరాల క్రితం జాబ్ కు రాజీనామా చేసిన వెడ్మ బొజ్జు రేవంత్ రెడ్డి( Revanth Reddy ) సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.కాంగ్రెస్ పార్టీ దృష్టిని ఆకర్షించి టికెట్ సంపాదించారు.
వెడ్మ బొజ్జు నామినేషన్ లో తనకు సొంతిల్లు లేదని 8 లక్షల 42 వేల రూపాయల అప్పులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.ఖానాపూర్ నియోజకవర్గం( Khanapur Constituency ) ఏర్పడిన తర్వాత గోండు సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు మాత్రమే విజయం సాధించారు.దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత ఈ ఘనత సాధించిన రెండో వ్యక్తిగా వెడ్మ బొజ్జు వార్తల్లో నిలిచారు.వెడ్మ బొజ్జు రియల్ లైఫ్ స్టోరీ ఎంతోమందిలో స్పూర్తి నింపుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.