మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ( Varun Tej )తాజాగా గాండీవ దారి అర్జున సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మెగా ఫాన్స్ కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి ( Lavanya Tripati )తన జీవితంలోకి రాబోతుందని ఆమె వరుణ్ తేజ్ సినీ కెరీర్ కు ఐరన్ లెగులా మారింది అంటూ చాలామంది లావణ్య త్రిపాటి పై విమర్శలు చేస్తూ వచ్చారు.

ఇలా ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో వరుణ్ తేజ్ ఈ సినిమా విషయం అంతటితో మర్చిపోయి తదుపరి సినిమాలపై ఫోకస్ చేశారు.ఇకపోతే వరుణ్ తేజ్ గత కొన్ని సంవత్సరాలుగా నటి లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ప్రేమలో విహరిస్తున్నటువంటి ఈ జంట పెద్దల అంగీకారంతో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం( Engagment ) జరుపుకున్నారు ఇలా వీరి నిశ్చితార్థం జూన్ 20వ తేదీ ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది.

ఇకపోతే ఈ జంట ఈ ఏడాది చివరిలో పెళ్లి చేసుకుని ఒకటి కాబోతున్న సంగతి తెలిసిందే.ఇక వరుణ్ తేజ్ సైతం తన ప్రేమ విషయం బయటపడిన తర్వాత తమ ప్రేమ గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.లావణ్య త్రిపాఠి, తన ఆలోచనలు అభిరుచులు ఒకటే కావడంతో జీవితాంతం ఇలాగే ముందుకు వెళ్లాలని నిశ్చయించుకున్నామని అందుకే ఈ ప్రేమ విషయాన్ని నేనే ముందుగా లావణ్యకు ప్రపోజ్ చేశాను అంటూ వరుణ్ తెలిపారు.
ఇక వీరి ప్రేమ విషయంలో నిహారిక( Niharika ) సపోర్ట్ కూడా చాలా ఉందనే చెప్పాలి.
ఈ విధంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్నారు.ఇక వీరి వివాహం నవంబర్ చివరిన లేదా డిసెంబర్ నెలలో జరగవచ్చని వరుణ్ తేజ్ వెల్లడించారు అయితే ఇప్పటికే పెళ్లి పనులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇలా పెళ్లి పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెళ్లి కాకుండానే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా భారీగా వర్కౌట్స్ చేస్తూ కష్టపడుతున్నారు.

తరచూ నిహారిక లావణ్య జిమ్ కి వెళ్తూ వర్క్ అవుట్ చేయడం మనం చూస్తుంటాము అయితే తాజాగా కాబోయే భర్తతో కలిసి లావణ్య జిమ్ లో భారీగా వర్కౌట్ చేస్తూ చెమటలు చిందిస్తున్నారు.ఈ క్రమంలోనే జిమ్ లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోని వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బెస్ట్ వర్కౌట్ బుడ్డి అంటూ లావణ్యతో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో నేటిజన్స్ ఈ ఫోటో పై వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి కాకుండానే ఇద్దరు భారీగా కష్టపడుతున్నారంటూ కొందరు ఈ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు.